Featured

Senior Actress Kavitha : దేవుడు నా అనుకున్న వాళ్ళను నాకు దూరం చేసాడు… అల్లు అరవింద్ బ్రదర్ లానే.. నా బ్రదర్ చనిపోయాడు : సీనియర్ నటి కవిత

Senior Actress Kavitha : పదకొండేళ్ళకే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్ గాను అలాగే సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఇటు రాజకీయాల్లోనూ ఉన్న కవిత గారు తన సినిమా కెరీర్ లో ఎదుర్కొన్న ఎన్నో అనుభవాలను పంచుకున్నారు. కవిత గారు తమిళ ఇండస్ట్రీలో మొదలు పెట్టి తెలుగులోను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ఆ తరువాత హీరోయిన్ గా అడుగుపెట్టారు. చిరంజీవి, కృష్ణ ఎన్టీఆర్ ఇలా అందరి హీరోలతో చేసిన కవిత గారు కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో సినిమాలకు గుడ్ బై చెప్పేసారు. ఇక తను నటించే సమయానికి ఇండస్ట్రీ వాతావరణం గురించి తాజాగా యూట్యూబ్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

నా అన్నవాళ్ళను దేవుడు దూరం చేసాడు…

కవిత గారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. తను సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తున్నపుడు తనకంటే సంవత్సరం చిన్నవడైన తమ్ముడు చనిపోవడంతో క్రుంగిపోయాను అంటూ చెప్పారు. ఎలక్ట్రికల్ ట్రైన్ కొత్తగా వచ్చినపుడు అందులో సరదాగా వెళ్లి ట్రైన్ కదిలినపుడు ఎలక్ట్రికల్ పిల్లర్ తగిలి మరణించాడు. మొదట అలా అల్లు రామలింగయ్య గారి కొడుకు అలా మరణించాడు, అల్లు అరవింద్ తమ్ముడు నా తమ్ముడు ఇద్దరు స్నేహాతులు వాళ్లిద్దరూ ఒకేలా చనిపోయారు. ఒక సంవత్సరం పాటు నా తమ్ముడు లేడనే డిప్రెషన్ కి వెళ్ళిపోయాను చికిత్స కూడా తీసుకున్నాను అంటూ చెప్పారు.

అపుడు అంత బాధ అనుభవించిన కవిత గారు ఇటీవల కోవిడ్ సమయంలో కొడుకును భర్తను కోల్పోయారు. ఇక ఆ విషాదం నుండి బయటికి రావాల్సి వచ్చింది. నా ఇద్దరు కూతుర్లను చూసుకోవాల్సిన బాధ్యత నామీదే ఉండటం వల్ల రాయిలా మారాను అంటూ చెప్పారు. ఇక ఆ విషాదానికి ముందు అందరూ స్నేహితులు ఉన్నారు. ఎప్పుడైతే నాభర్త, కొడుకు చనిపోయాక నా అనేవాళ్ళు ఎవరో అర్థమైంది, అప్పుడు నేనున్నాను అని భరోసా ఇచ్చిన వాళ్ళను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు అంటూ ఎమోషనల్ అయ్యారు కవిత.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago