Senior Actress P.R. Varalakshmi : నగరి కి చెందిన పిఆర్ వరలక్ష్మి గారు తెలుగు లోనే కాకుండా తమిళం, కన్నడ హిందీ, మలయాళం ఇలా పలు భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వందల సినిమాల్లో నటించిన వరలక్ష్మి గారు ‘కృష్ణావతారం’ సినిమా ద్వారా తెలుగులో పరిచయమయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణం రాజు ఇలా అందరు హీరోలతో నటించిన ఆమె మహేష్ బాబు, బాలకృష్ణ ఇలా తరువాత తరం వారితోనూ నటించారు. తమిళంలో సీరియల్స్ లో నటిస్తున్న వరలక్ష్మి గారు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.
భర్త, పిల్లలు.. ఆస్తులు ఎన్ని కోట్లంటే…
వరలక్ష్మి గారు తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికీ పనిచేస్తున్నారు. సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. తెలుగు సినిమా అలానే బుల్లి తెరకు దూరంగా ఉన్న ఆమె చెన్నై లోనే ఉండటం వల్ల తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికీ కొనసాగుతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వరలక్ష్మి గారు ముప్పై ఏళ్లుగా భర్తకు దూరంగా ఉన్నారు. వ్యక్తిగత కారణాలల్తో విడాకులు తీసుకున్న ఆమెకు ఇద్దరు కూతుర్లు. ఇద్దరు కూతుర్లు ఇంజనీర్లు గా పనిచేస్తున్నారు, అల్లుళ్ళు కూడా ఇంజనీర్లు అంటూ కుటుంబం బాగా సెటిల్ అయిందంటూ తెలిపారు.
వరలక్ష్మి గారిది చిత్తూరు జిల్లా నగరి. తాతల నుండి పెద్ద కుటుంబం అలానే ఎన్నో దాన ధర్మాలు చేసిన కుటుంబం కావడంతో అదే దాన ధర్మాలు చేసే అలవాటు వరలక్ష్మి గారికి ఉండటం వల్ల ఆస్తి ఎక్కువ లేదంటూ తెలిపారు. అయితే మరీ ఇబ్బందులు పడేంత పరిస్థితి లేదు అలా అని వందల కోట్ల ఆస్తులు అంటూ లేవని, ఇల్లు ఉంది నాకంటూ డబ్బు సంపాదించుకుంటున్నాను, ఇక మిగిలిన కుటుంబసభ్యులు బాగా సెటిల్ అయ్యారంటూ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…