Senior Actress Raksha : అనకాపల్లి నుండి చెన్నై కి వెళ్లి స్థిరపడి పదనాలుగేళ్ళకే సినిమాల్లోకి అడుగుపెట్టి స్పెషల్ సాంగ్స్ తో మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్న నటి రక్ష. నిజానికి ఆమె అసలు పేరు రాణి కాగా తండ్రి నిర్మాత గా ఎన్టీఆర్, శోభన్ బాబులతో సినిమాలను నిర్మించారు. తెలుగు ఇండస్ట్రీ లో సినిమా చేసినపుడు తన పేరును రక్ష గా మార్చుకున్న రాణి గారు తమిళంలో మాత్రం రాణి గానే గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలో విక్రమ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైనా ఆమె ఆపైన విక్రమ్ సినిమా జెమిని లో ‘ఓ పోడు’ సాంగ్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు. ఇక తెలుగులో సెకండ్ హీరోయిన్ గా చెల్లిగా ఇలా చాలా సినిమాల్లో నటించిన ఆమె సెకండ్ ఇన్నింగ్స్ లో ‘నచ్చావులే’ సినిమాలో తనీష్ తల్లిగా నటించి నంది అవార్డు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పలు సీరియల్స్ తో బిజీగా ఉన్న ఆమె మళ్ళీ సినిమాలో నటించాలని అనుకుంటున్నారు.
ఎంత మందిని కొట్టానో లెక్కపెట్టుకోలేదు…
రక్ష గారు హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీ కి వచ్చిన హీరోయిన్ గా కంటే స్పెషల్ సాంగ్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రేమలేఖ సినిమాలో ‘చిన్నదాన’ సాంగ్ అప్పట్లో బాగా హిట్ అయి రక్ష గారికి మంచి పేరు తెచ్చింది. ఇక తమిళంలో ‘ఓపోడు’ సాంగ్ తో ఫేమస్ అయి ఓ పోడు రాణి గా పేరు తెచ్చుకున్నారు. అలా స్పెషల్ సాంగ్స్ తో బిజీ గా ఉన్న తాను కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నపుడే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక ఆ పైన గ్లామర్ పాత్రలను చేయనని తన వద్దకు వచ్చే డైరెక్టర్స్ కి చెప్పేవారట.
తమిళంలో వచ్చిన పెద్ద రాయుడు మాతృక సినిమాలో టీచర్ పాత్రలో నటించిన ఆమె మరోసారి అలాంటి పాత్ర చేయమని అడిగితే ఒక డైరెక్టర్ కి చేయనని చెప్పేశారట. అయితే డైరెక్టర్ మాత్రం అలా ఎక్సపోసింగ్ ఏమి ఉండదు చేయండి అని చెప్తే షూటింగ్ వెళ్లగా అక్కడ మళ్ళీ స్లీవ్ లెస్ వేసుకోమని ఫోర్స్ చేశారట. నేను చేయనని ముందే చెప్పాను అని చెప్పిన డైరెక్టర్ బలవంతంగా చేయించాలని చూస్తే కోపంతో ఆయన ముఖం మీద కొట్టి అక్కడి నుండి వచ్చేసారట రక్ష. ఇలా ఇంతకుముందు కూడా కొంతమంది ఆర్టిస్టులను కొట్టినట్లు తనతో తప్పుగా ప్రవర్తిస్తే కోపం వస్తుందని దీని వల్ల చాలా సార్లు ఆఫర్స్ పోయాయి అంటూ చెప్పారు రక్ష.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…