Categories: FeaturedMovie News

Senior actress Roja Ramani : ఆరోజు హరికృష్ణ లేకపోతే… ఈరోజు నేను లేను…: సీనియర్ నటి రోజా రమణి

Senior actress Roja Ramani : తమిళ నట పుట్టి భక్త ప్రహల్లాద సినిమాతో బాల నటిగా జాతీయ ఉత్తమ బాలనటి అవార్డు అందుకున్న రోజా రమణి గారు పెద్దయ్యాక హీరోయిన్ గా, హీరోలకు చెల్లిగా అనేక సినిమాలలో నటించింది. ఇక ఒరియా నటుడైనా చక్రపాణిని వివాహం చేసుకున్న రోజా రమణి గారికి తరుణ్ అలాగే అమూల్య లు సంతానం. ఇక తెలుగు ప్రజలకు హీరో తరుణ్ సుపరిచితుడే. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన సినిమా విశేషాలను పంచుకున్నారు.

హరికృష్ణ గారు లేకపోతే ఈరోజు…

రోజా రమణి గారు హీరో చెల్లిగా నటిస్తూ ఉన్న సమయంలో ‘తాతమ్మ కల’ సినిమాలో ఎన్టీఆర్ కూతురుగా నటించిన రోజా రమణి గారు ఆ సినిమాలో హరికృష్ణ, బాలకృష్ణ ఇద్దరి తోనూ నటించారు. సినిమాలో రోజా రమణి గారు ఆత్మహత్య చేసుకునే సీన్ ఒకటి ఉండగా విజయవాడ బ్రిడ్జి మీద షూటింగ్ చేస్తుండగా కృష్ణా నది ఉదృతంగా ప్రవహిస్తుండగా పై నుండి కిందికి దూకుతున్నట్లుగా కింద నుండి కెమెరా పెట్టి సీన్ చేస్తున్నారు. బ్రిడ్జి నుండి కిందకి నా మొహం సగం కనిపిస్తుండటంతో కొంచం ఎత్తు పెట్టాల్సి వచ్చింది. బ్రిడ్జ్ మీద కాసేపు ట్రాఫిక్ అపి ఆ సీన్ చేస్తుండటంతో ఎన్టీఆర్ గారిని చూడటానికి చాలా మంది అక్కడ గుమిగూడారు.

అలా ఉన్న ఒక నూనె వ్యాపారి వద్ద రెండు నూనె డబ్బాలను తీసుకుని వాటి మీద నన్ను నిలబడి నది లోకి పడినట్లుగా చేయమన్నారు. డైరెక్షన్ ఎన్టీఆర్ గారు చేస్తుండటం ఒకటైతే ఆ డబ్బాలు ఖాళీవి కావడంతో బాగా కదులుతున్నాయి, కాస్త అటు ఇటు అయితే నదిలో నిజంగానే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఒక అబ్బాయి పట్టుకున్నా డబ్బాలు కదులుతున్నాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న హరికృష్ణ గారు వచ్చి ఆ అబ్బాయిని పక్కకు తీయమని చెప్పి ఆయన కాళ్ళు పట్టుకుని కూర్చున్నారట. ఆయన అలా చేయకపోయుంటే పడి పోయేదాన్ని నదిలోకి అందులోనూ ఆయన పట్టుకోనవసరం లేదు ఇంకెవరికైనా చెప్పుండొచ్చు కానీ అలా చేయలేదు అంటూ తెలిపారు రోజా రమణి.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago