Chaitanya Master Students : డాన్స్ షో ద్వారా అందరికీ సుపరిచితుడైన చైతన్య మాస్టర్ శనివారం నాడు నెల్లూరు లోని క్లబ్ హోటల్ లో ఆత్మహత్య చేసుకుని మరణించడంతో టెలివిజన్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఎపుడూ అందరినీ నవ్విస్తూ సరదాగా ఉండే చైతన్య మాస్టర్ ఒక్కసారిగా దూరం అవ్వడం ఢీ లో పనిచేస్తున్న డాన్స్ మాస్టర్లు అలాగే బాయ్స్ ఎవరూ తట్టుకోలేకపోతున్నారు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియోలో ఇంట్లో వాళ్లకు స్నేహితులకు ఢీ మిత్రులందరికీ సారీ చెప్పి ఆర్థిక ఇబ్బందులతోనే చనిపోతున్నట్లు చెప్పి ఉరి వేసుకున్న చైతన్య మాస్టర్ గురించి ఆయన స్టూడెంట్స్ భావోద్వేగానికి గురయ్యారు.
మరణానికి కారణం అప్పులు కాదు…
చైతన్య మాస్టర్ తన బాయ్స్ ని బాగా చూసుకునే వారు అంటూ ఆయన శిష్యులు చెప్పారు. మాకు ఏం కష్టం వచ్చినా ఆయన చూసుకున్నారు. డబ్బు విషయంలో ఎపుడైనా ఇబ్బందులు పడినా గ్రూప్ డాన్సర్స్ తో అందరికీ సహాయం చేసాడు. 24 గంటలు మాతోనే ఉండేవాడు. గత ఢీ సీజన్ గెలవకపోవడం వల్ల చాలా బాధపడ్డాడు. ఇక ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిపోవడం వల్ల బాధపడ్డాడు. కానీ అదే చావుకు కారణం కాకపోయి ఉండవచ్చు.
ఎందుకంటే మాకాందరికీ ఎపుడూ మోటివేషన్ ఇస్తుంటాడు చైతన్య మాస్టర్. ఇక సెట్స్ కి మేము వెళితే చైతన్య మాస్టర్ శిష్యులం కాబట్టి మాకుండే రెస్పెక్ట్ వేరే ఉంటుంది. ఇకపైన ఢీ సెట్స్ కి వెళ్లాలంటే ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదు. ప్రతి సారి చైతన్య అన్న ముఖం గుర్తొస్తోంది అంటూ ఆయన ఒక శిష్యుడు చెప్పారు. ఇక ఆయన మరణానికి ఆర్థిక సమస్యలు అనేది నిజం కాదనిపిస్తుంది. కానీ ఎవరి వల్లయినా ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే మాత్రం వాడిని విడిచిపెట్టం. ఆయన మరణానికి కారణం అయిన వాడిని వదలం అంటూ ఎమోషనల్ అయ్యారు చైతన్య మాస్టర్ శిష్యులు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…