ప్రస్తుతకాలంలో ప్రేక్షకుల అభిరుచులలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే స్టార్ హీరో హీరోయిన్ల సినిమాలలో ఏ మాత్రం కథలో ఏమాత్రం వినోదం లేకపోయినా.. చిన్న సినిమాలలో వైవిధ్యభరితమైన పాత్రలు ఉంటే చిన్న సినిమాలకు మాత్రమే ప్రేక్షకులు ఓటు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రేక్షకుల ఆలోచనా ధోరణిని గుర్తుపెట్టుకొని దర్శకుడు చైతన్య కొండ ఎంతో వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో సావిత్రి w/o సత్యమూర్తి అనే సినిమాను రూపొందిస్తున్నారు.
ఈ సినిమాలో 20 సంవత్సరాల భర్తకు 60 సంవత్సరాల భార్య ఉంటుంది. ఎంతో వైవిధ్యమైన ఈ కాన్సెప్ట్ లో హీరో పాత్రలో కేరింత ఫేమ్ పార్వతీశం నటించగా హీరోయిన్ పాత్రలో కమెడియన్, సీనియర్ నటి శ్రీలక్ష్మి నటిస్తున్నారు. ఎంతో వైవిధ్యభరితమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఏ1 క్రియేషన్స్ బ్యానర్ పై నరేంద్ర నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.ఈ క్రమంలోనే ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఎంతోమంది నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ క్రమంలోనే 20 ఏళ్ల భర్తకు 60 ఏళ్ల భార్య ఇదెలా సాధ్యం.. అంటూ పలువురు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోన్న . ‘సావిత్రి w/o సత్యమూర్తి’సినిమా అన్ని రకాల ప్రేక్షకులను ఎంతో ఎంటర్టైన్ చేస్తుందని ఖచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నచ్చుతుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేశారు.ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఈ సందర్భంగా చిత్ర బృందం తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…