Senior Actress Vanisri : “అబ్బాయిగారు” ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో 1993 లో విడుదలైన చిత్రం. ఇందులో వెంకటేష్, మీనా, జయచిత్ర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని రాశి మూవీ క్రియేషన్స్ పతాకం పై ఎం. నరసింహారావు నిర్మించాడు. ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించగా వేటూరి సుందర్రామ్మూర్తి, భువనచంద్ర, వెన్నెలకంటి పాటలు రాశారు. వి. శ్రీనివాస రెడ్డి కెమెరా బాధ్యతలు నిర్వహించగా కె. రవీంద్రబాబు కూర్పుగా వ్యవహరించాడు. ఈ సినిమా విజయం సాధించింది.
“అల్లుడా మజాకా” ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో 1995 లో విడుదలైన చిత్రము. ఇందులో చిరంజీవి, రమ్యకృష్ణ, రంభ, ఊహ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై దేవివరప్రసాద్ నిర్మించాడు. కోటి సంగీత దర్శకత్వం వహించాడు. పోసాని కృష్ణమురళి చిత్రానువాదం సమకూర్చాడు. ఈ సినిమా కిలాడీ అనే పేరుతో కన్నడలో పునర్నిర్మాణం చేసారు. అయితే వాణిశ్రీ ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒకసారి నిర్మాత నరసింహారావు వెంకటేష్ హీరోగా నటించిన “అబ్బాయిగారు” చిత్రం కోసం నన్ను సంప్రదించారు.
కథ అందులోని నా పాత్ర పరవాలేదనిపించింది.కానీ నేను అడిగిన మొత్తం వారు ఇవ్వకపోవడంతో ఆ చిత్రాన్ని వదులుకోవల్సివచ్చింది. అలాగే అబ్బాయిగారు చిత్రం తర్వాత రెండేళ్లకు నిర్మాత దేవి వరప్రసాద్,చిరంజీవి హీరోగా నటించిన “అల్లుడా మజాకా” చిత్రంలో చిరంజీవి అత్తగారి పాత్ర కోసం నన్ను సంప్రదించారు.కానీ ఆ పాత్ర కొన్ని పరిమితులు దాటి ఉండడంతో తాను వదులుకున్నానని.ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.కాని వాణిశ్రీ వదులుకున్న ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి.
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…