Featured

Sreeleela : టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోయిన్ కి లేని మంచితనం శ్రీ లీల సొంతం !

Sreeleela : మన సినిమా ఇండస్ట్రీ లో కొత్త నీరు రావాలి, అలానే కొత్త కొత్త ఆర్టిస్ట్స్ పరిచయము అవుతుంటేనే మన సినిమా పరిశ్రమ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒక సినిమా విషయంలో డైరెక్టర్ రాసుకున్న స్టోరీకి తాను సెలెక్ట్ చేసుకున్న హీరో ఎలా వంద శాతం సరిపోతున్నాడో , అలానే హీరోయిన్స్ కూడా వంద శాతం సరిపోతేనే, ఆ సినిమా చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతుంటారు. మన టాలీవుడ్ ఇండస్ట్రీ లో గ్లామర్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ చాలా అరుదుగా కనబడుతుంటారు .ఇక హీరోలు అభిరుచి కి తగ్గట్టు గా అలానే ఒక్కో సారి డైరెక్టర్స్ అభిరుచి తగ్గట్టుగా, ప్రొడ్యూసర్స్ డిమాండ్ కి తగ్గట్టుగా హీరోయిన్ సెలెక్షన్ ఉంటుంది .

అనుకోకుండా సీనిమా ఇండస్ట్రీ లోకి వచ్చాము అని కొందరు అంటారు. మరి కొంత మంది అయితే ఎదో యాదృచ్చికంగా ఇండస్ట్రీ కి వచ్చాము అని అంటారు. ఇక చాలా మంది సినిమా పరిశ్రమ లోకి వెళ్ళాలి అంటే చాలా సార్లు అలోచించి కానీ ఒక నిర్ణయం తీసుకోరు . ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే మినిమమ్ డిగ్రీ లేక మోడలింగ్ పరిశ్రమ కు చెందిన వారికి అవకాశాలు చాలా ఎక్కువగా వస్తాయి . కెరీర్ ఒకటి అయితే చేస్తున్న పని ఇంకొకటి ఇది సినిమా ఇండస్ట్రీ లో చాలా సహజం.

ఇక శ్రీలీల కెరీర్ విషయానికి వస్తే చిన్నప్పటి నుండి బాగా చదువుతుండేది ,చదువు అంటే ప్రాణం తన తల్లి లాగ డాక్టర్ అవ్వాలని పెద్ద కలలు కనేది, ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ చదువుతూ కూడా నటనలో చక్కగా రాణిస్తుంది. 2019 లో కన్నడ సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ ‘కిస్’ అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఇక ఆ తరువాత 2021 లో డైరెక్టర్ గౌరీ రోణంకి డైరెక్షన్ లో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ కన్నడ హీరోయిన్ శ్రీలీల కాంబినేషన్ లో వచ్చిన క్యూట్ లవ్ స్టోరీ మూవీ పెళ్లి సందD మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయము అయింది. పెళ్లి సందD సినిమాలో హీరోయిన్ శ్రీలీల గ్లామర్ మరియు నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక పెళ్లి సందD సినిమా ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన శ్రీ లీల కు మాత్రం అవకాశాలు వెతుకుంటూ వచ్చాయి. ఇక డైరెక్టర్ త్రినాధరావు నక్కిన డైరెక్షన్ లో మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న మాస్ ఎంటర్ టైనర్ మూవీ ధమాకా. ఈ మూవీ లో మాస్ మహారాజ్ రవితేజ సరసన హీరయిన్ గా శ్రీ లీల కు ఛాన్స్ దక్కించుకుంది.

ఇక దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క దిద్దు పెట్టుకోవాలి అనే సామెత గుర్తుంది కదా, ఈ సామెత హీరోయిన్స్ పక్కాగా సెట్ అవుతుంది. మొదటి సినిమాలో చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న శ్రీ లీల, ఆ తరువాత అవకాశాలు బాగా వస్తుండటంతో రెమ్యునరేషన్ రేట్ బాగా పెంచేసింది. ప్రస్తుతం శ్రీ లీల బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ఇక శ్రీ లీల పర్సనల్ లైఫ్ లో ఎన్ని విషాదాలు ఉన్నా ప్రస్తుతం శ్రీ లీల ఫోకస్ అంతా సినిమా మీదనే ఉంది. ఇక రెమ్యునరేషన్ విషయంలో బాగా రేటు పెంచేసింది అని తెలుస్తున్న, ఈ రెమ్యునరేషన్ లో సగ భాగాం సమాజంకోసం ఉపయోగిస్తుంది. అనాధలకు సేవ చేయడానికి ఎప్పుడు ముందుండే శ్రీలీల ఇద్దరు వికలాంగులను దత్తత తీసుకొని వారి బాగోగులను దగ్గర ఉండి చూసుకుంటుంది. ఇక స్టార్ హీరోయిన్స్, బాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యునరేషన్ తో పోల్చుకుంటే హీరోయిన్ శ్రీలీల రెమ్యునరేషన్ చాల తక్కువ. ఇక రెమ్యునరేషన్ ఎక్కవ తీసుకున్నా తనకోసం తన సరదాలు కోసం కాదు, తన వంతు బాధ్యత తీసుకొని ఇద్దరు వికలాంగులను దత్తత తీసుకొని వారికి సాయం చేస్తూ గ్లామర్ హీరోయిన్ గానే కాకుండా గొప్ప మనసు ఉన్న మనిషిగా నిలిచింది ..

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago