Senior Artist Kavitha : పదకొండేళ్ళకే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్ గాను అలాగే సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఇటు రాజకీయాల్లోను ఉన్న కవిత గారు తన సినిమా కెరీర్ లో ఎదుర్కొన్న ఎన్నో అనుభవాలను పంచుకున్నారు. కవిత గారు తమిళ ఇండస్ట్రీలో మొదలు పెట్టి తెలుగులోను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ఆ తరువాత హీరోయిన్ గా అడుగుపెట్టారు. చిరంజీవి, కృష్ణ ఎన్టీఆర్ ఇలా అందరు హీరోలతో చేసిన కవిత గారు కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో సినిమాలకు గుడ్ బై చెప్పేసారు. ఇక తను నటించే సమయానికి ఇండస్ట్రీ వాతావరణం గురించి తాజాగా యూట్యూబ్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
భర్త, కొడుకు మరణం భరించలేకపోయాను…
కరోనా సమయంలో అందరి జీవితాల్లోనూ విషాదం మిగిల్చింది. అయితే నటి కవిత గారికి మాత్రం కోలుకోలేని దెబ్బలు కొట్టింది. ఒక వైపు కన్న కొడుకు మరణం. అది మరిచే లోపే భర్త మరణం ఆమెను కృంగదీసాయి. ఈ విషయం గురించి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు కవిత. తన భర్త లాంటి వాడు ఇంకెవరూ ఉండలేరని, డబ్బు మాత్రమే మనిషికి సంతోషాన్నివ్వదు, నన్ను మా ఆయన చాలా బాగా చూసుకున్నారు, ఒక మహారాణిలాగా చూసుకున్నారు అంటూ చెప్పారు. ఇక తన కొడుకు స్పెషల్ కిడ్ అయినా కూడా అన్నింటికీ నేనే వెళ్లి చూసుకున్నాను.
ఇండస్ట్రీలో కూడా నా కొడుకు అంటే చాలా ఇష్టం అంటూ మాట్లాడారు. విజయ నిర్మల గారు నా కొడుకు మాటలను బాగా ఎంజాయ్ చేస్తారు అలాంటి బిడ్డని కరోనాలో కోల్పోయాను, తనని పోగొట్టుకున్న పది రోజులకి భర్త చనిపోవడంతో భరించలేక పోయాను. దాంతో మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాను. అయితే పక్కింటి ఆవిడ వచ్చి నా ఇద్దరు కూతూర్లను చూపించి నువ్వు చచ్చిపోతే నీ బిడ్డ, భర్త దగ్గరకి వెళ్తావు ఈ ఇద్దరి పరిస్థితి ఏమిటి అంటూ చెప్పడంతో ఇక నా పిల్లలను చూసుకోవాలని వాళ్ళ కోసం బ్రతుకుతున్నా అంటూ చెప్పారు కవిత.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…