Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాడు. సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.
ఇక వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మూడవ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా మహేష్ బాబు గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైదరాబాదులో కోట్ల విలువ చేసే ఖరీదైన బంగ్లాలో నివాసం ఉంటున్న మహేష్ బాబు తాజాగా మరొక ఖరీదైన విల్లాని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
తాజాగా ఆ విల్లా రిజిస్ట్రేషన్ కోసమే దుబాయ్ కి
పయనమైనట్లు సమాచారం. మహేష్ బాబుకు ఇష్టమైన ఫేవరెట్ హాలిడే స్పాట్ దుబాయ్. సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండే మహేష్ బాబు కొంత తీరిక దొరికితే చాలు కుటుంబంతో కలిసి విదేశాలలో వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా మహేష్ బాబుకి దుబాయ్ అంటే చాలా ఇష్టం అందువల్ల ఏడాదికి రెండుసార్లైనా దుబాయ్ కి వెళ్లి కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.
అయితే దుబాయ్ కి వెళ్ళినప్పుడు తనకంటూ ఒక సొంత నివాసం ఉండాలన్న కారణంతో దుబాయిలో ఒక ఖరీదైన విల్లా అని మహేష్ బాబు కొనుగోలు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం. అది కూడా సముద్ర తీరాన ఎకో ఫ్రెండ్లీ నేచర్ తో విలాసవంతమైన విల్లానీ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే దుబాయ్ లోనే మహేష్ బాబు ఇలా విల్లా కొనుగోలు చేయడానికి కూడా కారణాలు ఉన్నాయి. తరచూ దుబాయ్ కి వెళ్లటమే కాకుండా నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ కూడా దుబాయిలో సెటిల్ అవ్వటంతో . మహేష్ బాబు కూడా అందరికీ వీలుగా దుబాయిలోనే విల్లాని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విల్లా రిజిస్ట్రేషన్ కోసం మహేష్ బాబు కుటుంబంతో కలిసి దుబాయ్ కి వెళ్లినట్లు సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…