Santosh Shoban: గోల్కొండ హై స్కూల్ సినిమా ద్వారా బాల నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ తర్వాత పేపర్ బాయ్ సినిమాతో హీరోగా గుర్తింపు పొందిన సంతోష్ శోభన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏక్ మినీ కథ, మంచి రోజులోచ్చాయి, కళ్యాణం కమనీయం అంటే ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా గుర్తింపు పొందిన సంతోష్ శోభన్ ప్రస్తుతం “అన్ని మంచి శకునాలే ” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు..
ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే 18 వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లు ప్రారంభమై జోరుగా సాగుతున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికీ పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న సంతోష్ శోభన్ ఇటీవల హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సమావేశంలో సినిమా గురించి విలేకరుల అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు.
ఈ క్రమంలో సంతోష్ మాట్లాడుతూ..” ఈ సినిమా నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమా. టైటిల్ వినగానే ఎంతో నిజాయితీగా తీసే సినిమా అనిపించింది. నా జీవితంలో ఇలాంటి కథ గాని ఇంతమంది నటీనటులతో కలిసి నటించే అవకాశం కానీ మళ్ళీ వస్తుందో లేదో అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.ఇప్పటివరకు నేను నటించిన సినిమాలలో బరువు మోసే పాత్రలలో నటించాను. కానీ ఈ సినిమాలో నవ్వుతూ.. నవ్విస్తూ ఉండే పాత్రలో నటించాను అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక ఈ సమావేశంలో మాతృ దినోత్సవం సందర్భంగా మీ అమ్మగారికి ఏం బహుమతి ఇవ్వాలనుకుంటున్నారు అని విలేకరులు ప్రశ్నించారు. దీంతో సంతోష్ మాట్లాడుతూ..’ అమ్మ నా సర్వస్వం. నటుడిగా సినిమాలు చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. నా కెరీర్ ప్రారంభమైనప్పటి నుండి నా జీవితంలో ఉన్న ఎత్తు పల్లాలను అమ్మ స్వయంగా చూసింది. కష్ట సమయాలలో నాకు ఎంతో అండగా నిలిచింది. ఇప్పటివరకు మాకు సొంత ఇల్లు లేదు. ఎప్పటికైనా ఒక పెద్ద ఇంటిని తనకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను ” అంటూ సంతోష్ చెప్పుకొచ్చాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…