Namrata: సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు కూతురుగా మాత్రమే కాకుండా తన సొంత టాలెంట్ తో ఎంతోమందిని అభిమానులుగా మార్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సితార అతి చిన్న వయసులోనే అత్యధిక ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా సితార అన్ని విషయాలలోనూ చాలా చురుగ్గాఉంటుంది.
నమ్రత కూడా ప్రతి విషయంలోనూ కూతురికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే మన భారతీయ సాంప్రదాయ నృత్యం అయిన భరతనాట్యం కూడా కూతురికి నేర్పించింది. ఇప్పటికే సితార ఎన్నోసార్లు తన డాన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా మరొకసారి అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో సందడి చేసింది. ఇక కూతురి డాన్స్ చూసి నమ్రతా కూడా ఫిదా అవుతూ ఒక పోస్ట్ షేర్ చేసింది.
బాలీవుడ్ పాటకు సితార డాన్స్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన నమ్రత..” నీ హృదయంతో డాన్స్ చేస్తే నీ పాదాలు దానిని అనుకరిస్తాయి అంటూ కూతురిని ప్రోత్సహిస్తూ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్లు సితార డాన్స్ కి ఫిదా అయి తన డాన్స్ పర్ఫార్మెన్స్ కి ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదిలా ఉండగా సితార తన తండ్రి నటించిన సినిమాలలోని ఎన్నో పాటలకు కూడా డాన్స్ చేసింది. ఇలా తన కూతురి డాన్స్ చూసి మహేష్ బాబు కూడా మురిసిపోతున్నాడు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సితార సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించింది. ఇలా డాన్స్ వీడియోలు, రీల్స్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా సితార చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో సితార షేర్ చేసిన పోస్ట్లు నిమిషాలలో వైరల్ అవుతూ ఉంటాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…