Senior Journalist Imandhi Ramarao : సూపర్ స్టార్ కృష్ణ గారు అశేష తెలుగు అభిమానులను శోక సముద్రంలో ముంచి వెళ్లిపోయారు. శరీరంలోని అవయవాలన్నీ పనిచేయడం ఆగిపోవడంతో ఆయన మరణించినట్లు వైధ్యులు ధ్రువీకరించారు. నవంబర్ 14న గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన కృష్ణగారికి చికిత్స అందించిన వైధ్యులు చికిత్సకు ఆయన శరీరం స్పందించకపోవడం వల్ల ఆయనను ఇంకా ఇబ్బంది పెట్టకూడదని భావించి కృష్ణ గారి కుటుంబం చికిత్స ఇక వద్దు అనే నిర్ణయం తీసుకోవడం వల్ల నవంబర్ 15 తెల్లవారుజామున ఆయన మరణించారు. ఆయన మరణం తరువాత ఆస్తులు, హక్కులు అలాగే వీలునామా గురించిన చర్చ మొదలయింది. వీటి గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడారు.
ఎవరెవరికి ఎంత ఇస్తారంటే…
కృష్ణ గారి సంతానం రమేష్ బాబు, మంజుల, మహేష్ బాబు, పద్మావతి, ఇందిరా ప్రియదర్శిని. ముగ్గురు ఆడపిల్లలను మంచి కుటుంబాలకు ఇచ్చి పెళ్లి చేసిన కృష్ణ గారు కొడుకులుద్దరినీ సినిమా రంగంలోకి పంపినా రమేష్ బాబు గారు నిలదొక్కుకోలేకపోయారు. ఇక ఆయన వ్యాపార రంగంలోకి వెళ్లిపోయినా మహేష్ మాత్రం అగ్ర హీరోగా ఎదిగాడు. ఇక రమేష్ బాబు గారు అనారోగ్య కారణాలతో మరణించడంతో కృష్ణ గారికి రమేష్ కుటుంబం గురించి ఆలోచించాల్సిన పరిస్థితి. అందుకే కృష్ణ గారు మరణించక ముందే వీలునామా లో ఎవరెవరికి ఏ ఆస్తులు ఇవ్వాలో రాసినట్లు ఇమందిగారు అభిప్రాయపడ్డారు.
మొదట రమేష్ కుటుంబానికి, అలానే మొత్తం మనవళ్లు, మనవరాళ్ల కు ఇక మహేష్ ఫ్యామిలీ కి అలానే కూతుర్లకు అన్నట్లుగా ఆయన పంపకాలు ఉండొచ్చు అంటూ చెప్పారు. ఇక నరేష్ కి ఆస్తిలో వాటా అంటే ఆయనకు కృష్ణ ఫ్యామిలీ కి బ్లడ్ రిలేషన్ లేదు. విజయనిర్మల గారి కొడుకుగా మాత్రమే చూసారు. అయితే ఆవిడ మీద ప్రేమతో ఇల్లు ఏమైనా సెంటిమెంట్ గా ఇస్తే ఇవ్వచ్చు ఆది కూడా హక్కుగా కాదు అంటూ ఇమంది గారు చెప్పారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…