Anchor Anitha Chowdary : తెలుగులో ఎంతో మంది యాంకర్స్ ప్రస్తుతం ఉన్నా ఒకప్పట్లో మాత్రం యాంకర్స్ అనగానే సుమ, ఉదయభాను, ఝాన్సీ, అనితా చౌదరి, శిల్ప గుర్తొస్తారు. ఈటీవీ, జెమిని ఛానల్స్ వచ్చిన తొలి నాళ్లలో యాంకర్స్ గా వీరు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వీరిలో అనితా చౌదరి అటు యాంకర్ గా చేస్తూనే ఇటు సీరియల్స్ లో కూడా నటిస్తూ పేరు తెచ్చుకుంది. కస్తూరి, ఋతు రాగాలు వంటి సీరియల్స్ ద్వారా మంచి పేరు తెచ్చుకుంది. ఇక సెలబ్రిటీ ఇంటర్వ్యూలను చేస్తూనే సినిమా అవకాశాలు అందుకున్నారు. ఇక తన వ్యక్తిగత విషయాలను ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
డ్రైవర్ తప్పు వల్ల యాక్సిడెంట్ అయింది… బాలయ్య వస్తారని అనుకోలేదు…
చిన్న వయసులోనే తండ్రి లేకపోవడం వల్ల కుటుంబ బాధ్యతలు తీసుకున్న అనిత గారు తన కెరీర్ లో చాలా సార్లు ఆక్సిడెంట్స్ కి గురై పెద్ద ప్రమాదాలనే చవిచూశారు. ఒకసారి కాలర్ బోన్ విరిగితే మరోసారి డిస్క్ విరిగిపోయింది. మరోసారి మోకాలికి పెద్ద గాయలు అయ్యాయి. అయినా మళ్ళీ తాను లేచి తన పని చేసుకుంటూ ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తున్నారు. మోదరటిసారి పెద్ద యాక్సిడెంట్ అమెరికాలో కస్తూరి సీరియల్ లో నటనకు అవార్డు వచ్చిన సందర్బంగా సన్మానం చేయగా హోటల్ కి కారులో వస్తుండగా డ్రైవర్ ఫోన్ పడిపోయిందని కిందికి వంగడంతో ఏదరుగా ట్రక్ వచేసి కొట్టింది. అలా అతని పొరపాటు వల్ల కాలర్ బోన్ బాగా విరిగిపోయి కుట్లు పడ్డాయి అంటూ చెప్పారు.
ఇక బాబు పుట్టాక యాక్సిడెంట్ అయినపుడు డిస్క్ విరిగిపోయి ఎడమ చేయి కాలు పనిచేయలేదు. ఆ సమయంలో నా అభిమాని ఒకరు అభిలాష వేమూరు నుండి నన్ను కలవడానికి వచ్చి నాకు జరిగిన యాక్సిడెంట్ చూసి బాలకృష్ణ గారికి వివరించింది. ఆయనకు సన్నహితురాలు కావడం, ఆయన వెంటనే స్పందించి ఆయనే స్వయంగా హాస్పిటల్ వచ్చి వాళ్ళ హాస్పిటల్ నుండి వైద్యులను తీసుకువచ్చి, మా కుటుంబ సభ్యులందరితో మాట్లాడి, నా భర్త అమెరికాలో ఉంటే ఆయనతోనూ మాట్లాడి ధైర్యం చెప్పి నాకు వైద్యం చేయించారు. సహాయం చేయాలంటే అంత చెయ్యాల్సిన అవసరం లేదు కానీ ఆయన చాలా కేర్ చూపించారు అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…