Senior Journalist Bharadwaj : తెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటనతో రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణంరాజు గారు మృతిని సినీ రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ‘చిలక గోరింకా’ సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన కృష్ణం రాజు ఇటీవల ప్రభాస్ హీరోగా వచ్చిన ‘రాధే శ్యామ్’ సినిమాలో కూడా నటించారు. సోమవారం సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు, కుటుంబసభ్యుల అశ్రు నయనాల మధ్య ఆయనకు అధికార లాంచనాలతో వీడ్కోలు చెప్పారు. పలువురు నేతలు, సినీ నటులు ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేసారు. అయితే ఈ తరుణంలో సీనియర్ జర్నలిస్ట్ అయిన భరద్వాజ్ గారు కృష్ణంరాజు కుటుంబానికి సంబందించిన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు.
కృష్ణంరాజు పెద్ద కూతురు సొంత కూతురు కాదు పెంచుకున్న అమ్మాయి…
కృష్ణం రాజు కుటుంబం గురించి ఆయన పిల్లల గురించి భరద్వాజ్ గారు చాలా ఆసక్తికర విషయాలు ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కృష్ణం రాజు గారికి వారి బంధువు అయిన సీతాదేవి గారితో వివాహం జరిగింది. అయితే పెళ్లి అయ్యి చాలా కాలం అయినా సంతానం కలగలేదని చాలా బాధ పడేవారట. అందుకే ప్రగతి అనే అమ్మాయిని పెంచుకున్నారు. ఈక్రమంలోనే ఒక శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తూ కారు ప్రమాదంలో సీతాదేవి గారు మరణించారు. తరువాత కొన్నాళ్లకు ఇంకొక బంధువు అయిన శ్యామలా దేవి గారిని ఇచ్చి వివాహం చేశారు. అయితే రెండవ వివాహం తరువాత కూడా పిల్లలు కలగలేదని పుత్రకామేష్టి యాగం చేశారు.
అప్పట్లో కృష్ణంరాజు గారు, జంధ్యాల గారు ఈ యాగం చేశారు. అయితే వీరిద్దరికీ యాగం తరువాత సంతానం కలిగింది, అందులోను కవలలు జన్మించారు. అయితే ఇద్దరికీ అమ్మాయిలే జన్మించారు. తరువాత మరో అమ్మాయి పుట్టింది. మొత్తం కృష్ణంరాజు గారికి పెంచుకున్న అమ్మాయితో కలిపి నలుగురు కుమార్తెలు. కొడుకులు లేరని తన తమ్ముడి కొడుకునే సొంత కొడుకులా చూసుకున్నారు. అందుకే ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ అపుడు కృష్ణంరాజు గారు బహిరంగంగానే తన నట వారసుడు ప్రభాస్ అని చెప్పారు. అంతలా ఆయన ప్రభాస్ ను అభిమానిస్తారు అని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…