Senior Journalist Bhardwaja : ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత ప్రభావం చూపిందో అందరికీ తెలుసు. అందులోనూ జక్కన్న డైరెక్షన్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల నటన సినిమాను మరో రేంజ్ లో నిలబెట్టాయి. అయితే వారి కష్టానికి ఫలితంగా నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. ఇంతవరకు ఆసియన్ పాటకు ఈ అవార్డు రావడం ఇదే తొలిసారి. అదీ కాక మన ఇండియన్ సినిమా అందునా తెలుగు సినిమాకు రావడంతో అందరికీ ఈ అవార్డు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఇక గోల్డెన్ గ్లోబ్ లాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డు తరువాత రాజమౌళి క్రిటిక్ ఛాయిస్ అవార్డు ను కూడా అందుకున్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డుల తరువాత ఆర్ఆర్ఆర్ నుండి మరో గుడ్ న్యూస్ వినిపిస్తోంది. అదే ఎన్టీఆర్ ఆస్కార్ బరిలో ఉన్నాడని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇందులోని నిజానిజాలను గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మాట్లాడారు.
ఆస్కార్ లిస్ట్ లో ఎన్టీఆర్…
నిజానికి ఆర్ఆర్ఆర్ సినిమాలో మెయిన్ హీరో రామ్ చరణ్, అతను రాముడు అనే భావనలో సినిమాలో చూపిస్తారు, అలా ఎన్టీఆర్ అతనికి సహాయం చేసే హనుమంతుడి పాత్రలో కనిపిస్తాడు అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న మాట ఎన్టీఆర్ ఫైనల్ లిస్ట్ లో ఆస్కార్ బరిలో ఉన్నాడు. అదే నిజమైతే ఇది తెలుగు సినిమాకే కాదు ఇండియన్ సినిమాకు గర్వకారణం. రాజమౌళి సినిమా హిట్ ఫ్లాప్ అనే విషయాల కంటే మార్కెట్ అనే విషయం మీద ఎక్కువ ఆలోచిస్తాడు. తెలుగులో మార్కెట్ గురించి ఆలోచించే దర్శకులు చాలా తక్కువ అంటూ చెప్పారు. ఇప్పుడు అంతర్జాతీయ వేదికగా రాజమౌళి అందుకుంటున్న అవార్డులన్నీ తన మార్కెట్ పెంచుకోడానికి ఉపయోగపడుతాయి అంటూ తెలిపారు భరద్వాజ్.
అందుకోసం రాజమౌళి అవార్డుల విషయంలో లాబీయింగ్ చేసి ఉండవచ్చు. ఎక్కడైనా లాబీయింగ్ చేస్తేనే అవార్డులు వస్తాయి. అయినా రాజమౌలి తనని తాను ప్రపంచ మార్కెట్ కి పరిచయం చేసుకుంటూ తెలుగు సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు ఇది పాజిటివ్ అంశం, ఇప్పుడు ఫిల్మ్ క్రిటిక్ అవార్డు అలానే గోల్డెన్ గ్లోబ్ వచ్చాయి. ఇకపై ఆస్కార్ కూడా అంతే ఇదంతా కూడా తన మార్కెట్ ను విస్తృత పర్చుకోడానికి అలానే తనను ఇంకొంచం ఎత్తుకు ఎదగడానికి రాజమౌళి ఉపయోగించుకుంటారు. ఇక ఇండియన్ సినిమాను వరల్డ్ సినిమాగా మార్చుకోడానికి రాజమౌళి కృషి చేస్తూ అందులోకి తెలుగు హీరోలను కూడా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇక పైన మహేష్ కూడా అలా పాన్ వరల్డ్ సినిమాల్లోకి వెళ్ళబోతున్నారు అంటూ అందులో తప్పు లేదు అంటూ భరద్వాజ అభిప్రాయపడ్డారు.
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…