Sudheer Varma: గత ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది సెలబ్రిటీలు మరణించి ఇండస్ట్రీకి తీరని లోటు మిగిల్చారు అయితే కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎదుగుతున్నటువంటి నటుడు సుదీర్ వర్మ మరణించిన విషయం మనకు తెలిసిందే. ఈయన వైజాగ్ లో ఆత్మహత్య చేసుకుని మరణించారు.
సుధీర్ వర్మ నటుడు సుధాకర్ కోమాకుల, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన కుందనపు బొమ్మ సినిమాలో కీలక పాత్రలో నటించారు.ఇలా పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎదుగుతున్న క్రమంలోనే ఈయన ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. ఈ విధంగా నటుడు సుధీర్ వర్మ మరణించారనే వార్త ఇండస్ట్రీకి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.ఈయన ఆర్థిక సమస్యల కారణంగానే మరణించారని వార్తలు వినపడుతున్నాయి.
సుధీర్ మరణ వార్త తెలుసుకున్న సెలబ్రిటీలు ఈయన మరణం పై స్పందిస్తూ తన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. ఈ క్రమంలోనే కుందనపు బొమ్మ హీరో సుధాకర్ కోమాకుల కూడా ఈ విషయంపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. సుధీర్ వర్మ మరణ వార్త వినగానే ఒక్కసారిగా షాక్ కి గురయ్యానని, ఆయన ఇక లేరనే మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను.. ఓం శాంతి అంటూ ఈయన ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…