RRR Movie: దర్శక దీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా చిత్రం RRR. ఈ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సినిమా కేవలం పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి ఆదరణ సంపాదించుకొని ఆస్కార్ రేసులో కూడా ముందంజలో ఉంది.
ఇప్పటికే ఈ సినిమా ఎన్నో అవార్డులను రివార్డులను అందుకోగా ఈ సినిమాపై ఎంతోమంది హాలీవుడ్ డైరెక్టర్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇలా ఒక తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి ఆదరణ సంపాదించుకోవడం తెలుగు చిత్ర పరిశ్రమకే గర్వకారణం అని చెప్పాలి.ఇలా తెలుగు భాషలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నటువంటి ఈ చిత్రాన్ని బాలీవుడ్ సినిమా అంటూ నటి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఆస్కార్ విజేత, ప్రముఖ హాలీవుడ్ నటి అయిన జేన్ ఫోండా ఆర్‌ఆర్‌ఆర్ మువీపై ప్రశంసలు కురిపించింది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా పోస్టర్ ను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈ సినిమా నన్ను చాలా ఆశ్చర్య పరచిన చిత్రాలలో ఇదొకటి. ఇంతకు ముందు లెస్లీ మువీని సిఫార్సు చేశాను. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఈ భారతీయ సినిమా ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ అయింది. సామ్రాజ్యవాదం గురించి సీరియస్ గా చర్చించిన బాలీవుడ్ ఫిల్మ్ ఇది. నేను ట్రాన్స్‌ఫిక్స్ అయ్యాను’.. అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో జేన్ రాసుకొచ్చింది.
ఇలా ఈమె ఈ సినిమాని బాలీవుడ్ ఫిలిం అంటూ సోషల్ మీడియా వేదికగా ఈమె తెలియచేయడంతో ఈ విషయంపై నెటిజన్స్ స్పందిస్తూ ఇది బాలీవుడ్ సినిమా కాదు టాలీవుడ్ అచ్చ తెలుగు సినిమా. ఇండియన్ సినిమా అంటే అందరికీ బాలీవుడ్ సినిమాలే గుర్తుకు వస్తాయి. అయితే ఇప్పుడు పరిస్థితిలో తారుమారయ్యాయి. RRR సినిమా పూర్తిస్థాయి తెలుగు చిత్రం అంటూ నేటిజన్స్ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…