Senior Journalist Bhardwaja : అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రోమో విడుదలయింది. మొదటి గెస్ట్ గా ఏపీ మాజీ సిఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారు వచ్చారు. ఇక బాలకృష్ణ కు స్వయానా బావ అయిన చంద్రబాబు బాబు గారు అలాగే ఆయన తనయుడు లోకేష్ గారితో సరదా ప్రశ్నల్తో కొన్ని కాంట్రవర్సీ ప్రశ్నలతో ప్రోమో కట్ చేసారు. ఇక ప్రోమో విడుదల అయిన కాసేపటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ ట్రెండింగ్ లో మొదటి స్థానంలో నిలబడి బాలయ్య బాబు అంటే ఏంటో చూపించింది. ఇక ఈ షోలో చంద్రబాబు నాయుడు గారిని అడిగిన ప్రశ్నలు, ఇక ప్రోమోలో చూపించిన విషయాల మీద చర్చలు మొదలయ్యాయి. ఇక ఈ ప్రోమో గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మాట్లాడారు.
నిజంగానే మంచి స్నేహితులు…
అన్ స్టాపబుల్ షోలో మీ ప్రాణ స్నేహితుడు ఎవరు అంటూ బాలయ్య చంద్రబాబు ని అడగడంతో చంద్రబాబు గారు రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పడం మనకు చూపిస్తారు. ఇక ఈవిషయం గురించి మాట్లాడుతూ భరద్వాజ గారు ప్రోమోలో ఎలా కట్ చేశారు మనకు తెలియదు నిజంగానే చంద్రబాబు వైస్సార్ పేరు చెప్పారో లేదో తెలియదు, ప్రోగ్రామ్ లో హైప్ కోసం అలా కట్ చెసి ఉండొచ్చు కూడా, కానీ ఇద్దరూ సమకాలిన నాయకులు, ఇద్దరి రాజకీయ జీవితం ఒకేసారి ఒకే పార్టీలో మొదలయింది. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఇద్దరూ మంచి మిత్రులు. ఇక చంద్రబాబు వైస్సార్ ను సలహాలు అడిగేవారు. అలా ఆయనకు పెళ్లి సంబంధాల విషయంలో కూడా సలహా అడుగగా ఎన్టీఆర్ గారి ఇంట్లో చేసుకోమని రాజశేఖర్రెడ్డి సలహా ఇచ్చాడట. అలా ఇద్దరూ మంచి మిత్రులుగా ఉండేవారు అంటూ భరద్వాజ చెప్పారు.
కొడాలి నాని కేసు వేయొచ్చు…
ఇక భరద్వాజ గారు మాట్లాడుతూ బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో ఇంట్రడక్షన్ లో ఈ షో ఇండియా లోనే నెంబర్ గా నిలిచి అన్ని షోలకు అమ్మ మొగుడు అయింది అంటూ డైలాగు చెప్పారు. ఇక ఈ అమ్మ మొగుడు అనే డైలాగు ఏపీ వైస్సార్ సీపీ నాయకుడు కొడాలి నాని అంటుంటాడు. కాపీ రైట్స్ అతనికే ఉన్నాయి. కాబట్టి బాలకృష్ణ అతని డైలాగు చెప్పాడు కాబట్టి బాలయ్య మీద కేసు వేయొచ్చు. అయినా బాలకృష్ణ మీద కొడాలి నాని ప్రభావం ఎంతుందో అర్థమవుతుంది అంటూ భరద్వాజ గారు విశ్లేషించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…