Balakrishna : అన్ స్టాపబుల్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఆ ఒక్క షోతో ఆహా సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారి సంఖ్య బాగా పెరిగింది. ఇక రేటింగ్స్ లోనూ రికార్డులు సృష్టించింది అన్ స్టాపబుల్. సీజన్ వన్ ఆ రేంజ్లో హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇక సెకండ్ సీజన్ కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు సగటు ప్రేక్షకుడు కూడా ఎదురుచూస్తున్నాడు. ఇక అన్ స్టాపబుల్ సీజన్ రెండు మొదటి ఎపిసోడ్ త్వరలో రాబోతోంది, దీనికి సంబంధించిన ప్రోమో కుడా విడుదల చేసారు. మొదటి ఎపిసోడ్ ఏకంగా తెలుగు దేశం అధినేత స్వయానా బాలయ్యకు బావ అయిన నారా చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ లను పిలిచి బాలయ్య సందడి చేసారు. ఇక ఈ షోలో బావ చంద్రబాబు నే కాకుండా అల్లుడు లోకేష్ ను కూడా ఆటపట్టించారు బాలయ్య బాబు.
నీ ప్రైవేట్ ఫోటోలు అసెంబ్లీ వరకూ వెళ్లాయి…
ఇక ఇప్పటి వరకూ ఎవరూ అడగని ప్రశ్నలను బాలకృష్ణ బావ చంద్రబాబు, అల్లుడు లోకేష్ లను అడిగి ప్రోమో మీద ఇంట్రెస్ట్ పెంచేసారు. 1995 లో చంద్రబాబు సీఎం అవ్వడం దగ్గరి నుండి, లోకేష్ మంగళగిరి లో ఓడిపోయిన విషయంలో వరకు అన్ని విషయాలు అడిగారు బాలయ్య. ఇక లోకేష్ ను ఇప్పటివరకు విపక్షాలు ఏకిపారేసే విదేశీ అమ్మాయిల నడుమ లోకేష్ ఉన్న ఫోటోను చూపించి ఈ ప్రైవేట్ ఫోటో అసెంబ్లీ వరకు వెళ్ళింది అంటూ లోకేష్ ను అడిగాడు. ఇక చంద్రబాబు నాయుడు ని ఈ విషయంలో గురించి అడిగితే పిల్లనిచ్చిన మామకు లేని సందేహం నాకెందుకు అంటూ జవాబు చెప్పారు.
ఇక చిన్నప్పుడు ఏది చూసినా ఇది నాది అంటూ లోకేష్ అనేవాడు నిన్ను మూట కట్టి పడేస్తా అని ఏడిపించేవాడిని కానీ చివరకు నా కూతురు బ్రాహ్మణి నే తీసుకుపోతాడని అనుకోలేది అంటూ బాలకృష్ణ లోకేష్ ని ఉద్దేశించి జోక్ చేసారు. ఇలా సరదా సంభాషణ అలాగే కాంట్రవర్సీలను టచ్ చేస్తూ విడుదల అయిన ప్రోమో కి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా ఉంది బాలయ్య అన్ స్టాపబుల్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…