Senior Journalist Bhardwaja : సంక్రాంతి పండగ అంటే సినిమాలకు పండగ. పెద్ద హీరో, చిన్న హీరో అని తేడా లేకుండా అందరు హీరోల సినిమాలు ఈ పండగ అప్పుడు విడుదల చేసుకోడానికి ప్లాన్ చేస్తారు. అలాంటి సమయంలో డబ్బింగ్ సినిమాలు కూడా పండగ పూట హడావిడి చేస్తుంటాయి. అయితే ఈ సారి పండగకు చిన్న చిన్న సినిమలు చాలానే ఉన్నాయి. ఓవైపు మెగాస్టార్ మరోవైపు బాలయ్య.. వీళ్ళ ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు సంక్రాంతిని టార్గెట్ చేసాయి. అయితే సంక్రాంతి పండగనాడు హిట్టుకొట్టి నిలిచేది ఎవరు అన్నదే ప్రేక్షకులే నిర్ణయించాలి. జనవరి 12 న వీర సింహారెడ్డి వస్తే 13 న వాల్తేరు వీరయ్య సందడి చేయడానికి సిద్ధమయ్యాడు. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ల విషయంలో రెండు సినిమాలకు తేడా చూపడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఈ ఇష్యూ మీద సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు విశ్లేషించారు.
బాలకృష్ణ ను తక్కువ చేసిన జగన్…
ఏపీ సర్కార్ ఇంతకు ముందు టికెట్ రేట్ల విషయంలో తెలుగు సినిమాను ఇబ్బంది పెట్టడం అందరికీ తెలిసిందే. ఇక ఈ సారి వాల్తేరు వీరయ్య సినిమాకు, వీర సింహా రెడ్డి సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునే విషయంలో అనుమతి ఇచ్చినా వాల్తేరు వీరయ్య కంటే వీర సింహా రెడ్డి టికెట్ ధర ఐదు రూపాయలు తక్కువగా ఉండటం వల్ల బాలయ్య ఫాన్స్ ఫీల్ అవుతున్నారు. చిరు మా బాలయ్య ను తక్కువ చేశారని, కావాలనే ఏపీ ప్రభుత్వం ఇలా చేస్తోందని ఫీల్ అవుతున్నారట. ఇక ఈ విషయం గురించి భరద్వాజ గారు మాట్లాడుతూ బడ్జెట్ ప్రకారం టికెట్ రేట్ పెంచుకునే వెసులుబాటు ఏపీ ప్రభుత్వం ఇచ్చింది. ఒకరకంగా వాల్తేరు వీరయ్య కంటే వీర సింహా రెడ్డి టికెట్ రేట్ తక్కువ ఉండటం ఆ సినిమాకు పాజిటివ్ పాయింట్.
టికెట్ రేట్ ఎక్కువ ఉంటే జనాలు సినిమాలకు రావడం లేదనే వాదన ఆల్రడీ ఉంది. సినిమా చాలా బాగా ఉండి ఖచ్చితంగా థియేటర్ లోనే చూడాలి అనేలా ఉంటేనే జనాలు ఎక్కువ ధరకు టికెట్ పెట్టి సినిమా చూస్తారు లేదంటే ఓటిటి లో వచ్చినపుడు చూడొచ్చులే అని వదిలేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో టికెట్ ధర తక్కువ ఉన్న సినిమాగా వీర సింహా రెడ్డి కి వాల్తేరు వీరయ్య కంటే అడ్వాంటేజ్ ఉంది అంటూ చెప్పారు. ఈ విషయంలో వాళ్ళ హీరోను తక్కువ చేసారు ఏపీ ప్రభుత్వం అని ఫాన్స్ బాధపడితే దానివల్లే వాళ్ళ హీరోను తక్కువ చేసుకున్నట్లు అవుతుంది అంటూ తెలిపారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…