Senior Journalist Bhardwaja : గుజరాత్ నుండి చిన్న వ్యాపారవేత్తగా మొదలయిన ఆదాని ప్రయాణం నేడు ప్రపంచం కుబేరుల జాబితాలో టాప్ 10 లోకి చేరింది. అయితే కొత్త సంవత్సరం టాప్ 10 లో ఉన్న ప్రపంచ కుబేరులలో కేవలం ఆదాని సంపద మాత్రమే తరిగి పోయి టాప్ ప్లేసులో ఉన్న తనకు ఏడో స్థానానికి దిగజారాడు. గత కొద్ది రోజులుగా స్టాక్ ఎక్స్చేంజ్ లో మోసాలకు పాల్పడినట్లు ఆదాని గ్రూప్ మీద వార్తలు వెలువడ్డాయి. ఇక ఈ సంఘటనల మీద సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు అయన విశ్లేషణ ఇచ్చారు.
మోసాలకు పాల్పడినట్లు హిండెన్ బర్గ్ రిపోర్ట్…
అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్లో మోసాలకు పాల్పడినట్లు ప్రముఖ పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది. అమెరికాకు చెందిన ఈ కంపెనీ దాదాపు రెండున్నరేళ్ల పాటు చేసిన పరిశోధనలలో, అదానీ గ్రూప్ తన స్టాక్స్‌లో భారీ అవకతవకలకు పాల్పడుతోందని, అకౌంటింగ్ మోసాలు కూడా చేస్తోందని ఆరోపణలు గుప్పించింది. దశాబ్దాల కాలంగా స్టాక్ మానిపులేషన్ జరుగుతోందని, అకౌంటింగ్ ఫ్రాడ్, స్కామ్ జరుగుతోందని పరిశోధన రిపోర్ట్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ రిపోర్ట్ వెలువడడంతో ఒక్కసారిగా ఆదాని గ్రూప్ స్టాక్స్ పడిపోయి దాదాపు ఒక్కరోజులోనే 5.9 బిలయన్ డాలర్ల సంపద అంటే ఇండియన్ కరెన్సీ లో దాదాపుగా 49 వేల కోట్ల సంపద అవిరైపోయింది.
హిండెన్ బర్గ్ రిపోర్ట్ విడుదల మమ్మల్ని సంప్రదించకుండా చేసారంటూ ఆదాని గ్రూప్ ఆరోపించింది. ఏ మాత్రం ఆధారాలు లేకుండా ఇలాంటి ఒక రిపోర్ట్ ను ప్రకటించి కావాలనే మా కంపెనీకి నష్టం చెకూర్చాలని భావిస్తున్నారంటూ ఆదాని పేర్కొనడం విడ్డూరంగా ఉందంటూ భరద్వాజ అభిప్రాయపడ్డారు. మోసాలకు పాల్పడే వారు దొరికిపోయినపుడు చివరి అస్త్రంగా దొరికేది దేశభక్తి అయినట్లు ఆదాని కూడా జాతీయత గురించి మాట్లాడాడు. కావాలనే అమెరికన్ సంస్థ ఇలా చెస్తోందని, ఒక భారతీయుడు ఎదగడం నచ్చక ఇలా ప్రవర్తిస్తోంది అంటూ ఆరోపించారు. హిండెన్ బర్గ్ రిపోర్ట్ లో నాథన్ అండర్సన్ పేర్కొన్న 90% అంశాలకు ఆదాని వద్ద సమాధానం లేదంటూ అభిప్రాయపడ్డారు భరద్వాజ గారు. వాటిని వివరించకుండా కేవలం జాతీయత, దేశభక్తి అంటూ ఆరోపించడం ఏంటి అంటూ విమర్శించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…