Senior Journalist Bhardwaja : ఆహా ఒరిజినల్స్ లో వస్తున్న బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. సీజన్ వన్ ఎంత పెద్ధ హిట్టో అందరికీ తెలుసు. దీంతో సీజన్ 2 మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టే సీజన్ 2 కూడా సాగుతోంది. టాలీవుడ్ నుండి పలువురు సెలబ్రిటీస్ ఈ షోలో పాల్గొంటూ రచ్చ చేస్తున్నారు. అయితే షో మొదటి సీజన్ నుండి ఈ షోకి చిరు వస్తే బాలయ్య చిరుని ఒకే వేదిక మీద చూడాలని అభిమానులే కాదు తెలుగు ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్నారు. అయితే మొదటి సీజన్ లో రాలేదు పోనీ రెండో సీజన్ లో అయినా వస్తాడనుకుంటే అది జరిగేలా లేదు.
వేరే టాక్ షోలలో సందడి చేస్తున్న చిరు…
రెండో సీజన్ లోనూ ఆ ఆశలు గల్లంతైనట్లే కనిపిస్తోంది. అయితే చిరు మాత్రం ఈటీవీలో ‘సుమ టాక్ షో’ లోనూ అలాగే సోనీ లైవ్ లో వస్తోన్న ‘నిజం విత్ స్మిత’ లోనూ పాల్గొన్నారు. మరి బాలయ్య షోకి మాత్రం రాకపోడానికి కారణం ఏమిటి అంటూ అందరూ చర్చిచ్చుకుంటున్న నేపథ్యంలో సీనియర్ సినిమా జర్నలిస్ట్ భరద్వాజ గారు ఈ ఇష్యూ గురించి మాట్లాడారు. చిరంజీవి, బాలకృష్ణ అన్ స్టోపబుల్ లో పాల్గొంటారని ఎప్పటినుండో వినిపిస్తున్నా ఆయన ఇంకా ఆ షోకి రాకపోడానికి కారణం ఆయనను మూడో సీజన్ కోసం ప్లాన్ చేస్తున్నారంటూ చెప్పారు భరద్వాజ.
ఈ సీజన్ లో పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి బిగ్ స్టార్స్ రావడంతో షో పీక్స్ కి వెళ్ళింది. ఇక ఇప్పుడు నెక్స్ట్ సీజన్ లో చిరుని ప్లాన్ చేసినట్లు సమాచారం అందుతోంది. నెక్స్ట్ సీజన్ ఎండింగ్ ఎపిసోడ్ చిరుతో ప్లాన్ చేస్తారని సమాచారం అంటూ చెప్పారు. చిరంజీవి ఇప్పటి వరకు సినిమా ప్రమోషన్స్ అప్పుడు కూడా ఇదే ప్రశ్న ఎదురైనపుడు వాళ్ళ నుండి ఇంకా పిలుపు రాలేదంటూ చెప్పారే కానీ నేను వెళ్ళను అని అనలేదు, పిలిస్తే వెళతా అన్నట్లుగానే మాటాడారు. ఇక బాలయ్య కూడా అందరూ సీనియర్ యాక్టర్ కూడా షోకి వస్తారని చాలా సార్లు చెప్పారు. చిరు బాలయ్య అభిమానుల మధ్య వైరుద్యాలు ఉండి ఉండవచ్చు కానీ చిరు బాలయ్య మధ్య చక్కటి స్నేహం ఉంది అంటూ భరద్వాజ తెలిపారు.
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…