Movie News

Ashika Ranganath: కళ్యాణ్ రామ్ అమిగోస్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Ashika Ranganath: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం అమిగోస్. ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు విభిన్న పాత్రలలో ప్రేక్షకులను సందడి చేయబోతున్నారు. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన ఆషికా రంగనాథ్ హీరోయిన్ పాత్రలో సందడి చేయబోతున్నారు.

ఈ క్రమంలోనే ఈ ఆషికా రంగనాథ్ ఎవరు తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయాల గురించి పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తున్నారు. ఇక ఈమె కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటి కావడం విశేషం. ఆషికా రంగనాథ్ 2016 వ సంవత్సరంలో కన్నడ చిత్ర పరిశ్రమలో తెరకెక్కిన క్రేజీ బాయ్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు.

ఈ సినిమాలో దిలీప్ ప్రకాష్ హీరోగా సందడి చేశారు. ఈ సినిమా కన్నడ చిత్ర పరిశ్రమలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అనంతరం ఈమె పునీత్ రాజ్ కుమార్ శివరాజ్ కుమార్ వంటి హీరోల సరసన కూడా నటించారు. 2022లో అథర్వ హీరోగా నటించిన ‘పట్టాతు అరసన్’ మూవీతో తమిళంలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తమిళంలో పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఇలా మొదటిసారిగా ఈమె కళ్యాణ్ రామ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Ashika Ranganath: మిస్ ఫ్రెస్ ఫేస్ బెంగళూరుగా ఎంపికైన ఆషికా…

ఈ సినిమాపై ఈ ముద్దుగుమ్మ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈమె ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ విషయానికి వస్తే ఈమె 1996 ఆగష్టు 5న రంగనాథ్, సుధ దంపతులకు కర్ణాటకలోని బెంగళూరు సమీపంలోని తుముకూరులో జన్మించారు. ఈమె అక్క అనుష రంగనాథ్ కూడా హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక ఈమె చదువులు మొత్తం బెంగళూరులో పూర్తీ అయ్యాయి చదువులు పూర్తి అయిన తర్వాత 2014 మిస్ ఫ్రెస్ ఫేస్ బెంగళూరుగా ఎంపికైంది. చిన్నప్పటినుంచి నటన డాన్స్ అంటే ఎంతో ఇష్టం ఉండడంతో ఈమె ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago