Featured

Senior Journalist Bhardwaja : మోహన్ బాబు చేసిన అవమానానికి చిరంజీవి అవార్డు తీసుకోలేదు…ఆరోజు మోహన్ బాబు కి చిరంజీవి చేసిన సవాల్ ఇదే…: సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ

Senior Journalist Bhardwaja : సినిమా ఇండస్ట్రీ లో కనిపించని కోల్డ్ వార్ ఇద్దరు సమాకాలిన నటుల మధ్య ఎప్పటినుండో ఉంది. వాళ్ళు ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు. వీళ్ళిద్దరి కి అసలు గొడవ ఎక్కడ మొదయింది విభేదాలు ఎలా మొదలయ్యాయి అన్నది తెలియకపోయినా వీరి మధ్యనొక కోల్డ్ వార్ మాత్రం ఇప్పటికీ నడిస్తూనే ఉంది. ఇక ఈ విబేధాలు మొదటి సారిగా వేదిక సాక్షిగా బయటపడింది మాత్రం తెలుగు సినిమా వజ్రత్సవ వేడుకల్లోనే. లెజెండ్ ఎవరు సెలబ్రిటీ ఎవరు అన్న గొడవ తారాస్థాయికి చేరి చిరంజీవి ని అవార్డు తీసుకోడానికి నువ్వు అర్హుడివి కాదు అన్నట్లు మాట్లాడి మోహన్ బాబు అవమానించారు. ఇక ఈ విషయాల గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మాట్లాడారు.

మొదటి సారి ఆవేశంగా మాట్లాడిన చిరు….

చిరంజీవి గారిని లెజెండ్ అంటూ అవార్డు ఇవ్వడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన మోహన్ బాబు వేదిక మీదే నీకంటే గొప్పవారు నాగేశ్వరావు, కృష్ణ వంటి వరున్నారు. కృష్ణ గారు సినిమా ఇండస్ట్రీ కి ఎంతో చేసారు ఇండస్ట్రీ లో కొత్త ట్రెండ్ తెసుకోచ్చిన వ్యక్తికి ఇవ్వని గౌరవం నీకెలా ఇస్తారు అంటూ మాట్లాడారు. ఈ అవమానానికి చిరంజీవి గారు మాట్లాడుతూ ఈ అవార్డు అందుకునే అర్హత నాకు లేదని కొంతమంది అసూయతో ఉన్నారు, ఇప్ప్పటికే కెరీర్ లో ఈ స్థాయికి రావడానికి ఎన్నో అవమానలను అన్నింటిని భరించి వస్తే మళ్ళీ అదే చేస్తున్నారు కొంతమంది అంటూ మాట్లాడారు.

నాకి అవార్డు అందుకునే అర్హత లేదని కొంతమంది అభిప్రాయం కాబట్టి నేను ఈ అవార్డు తీసుకోను మరో ఇరవై ఐదేళ్లకు నూరు సంవత్సరాలు పూర్తయినా సందర్బంగా సినిమా వేడుకలు చేసుకున్నపుడు ఎవరు లెజెండ్ ఎవరు కాదో నిర్ణయం ప్రజలే తీసుకుంటారు అంటూ టైం కాప్ష్యుల్ లో అవార్డు ను ఉంచారు. అయితే భరద్వాజ గారు మాట్లాడుతూ మొదటి సారి చిరంజీవి ఆవేశంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడి తనకు అవార్డు ఇచ్చినవారిని అవమానించకుండా అలానే తనను అవమానించిన వాళ్లకు అలాగే వారి వెనక ఉన్నవారికి కొట్టినట్లు మాట్లాడి సమాధానం చెప్పారు ఇలా రాజకీయాల్లో ఆవేశంగా మాట్లాడి ఉంటే మంచి నాయకుడిగా నిలబడేవాడు అంటూ అభిప్రాయపడారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago