Featured

Senior journalist Bhardwaja : విజయనిర్మల, వాణిశ్రీ మధ్య గొడవ ఏంటి?? సారధి స్టూడియోలోకి ఏఎన్ఆర్ ను ఎందుకు అడుగుపెట్టనివ్వలేదు : సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ

Senior Journalist Bhardwaja : ఇద్దరు సమకాలిన హీరోలకు, హీరోయిన్లకు మధ్య పోటీ కామన్. పైకి అదంతా ఏమీ లేదు అంటున్నా లోపల మాత్రం కోల్డ్ వార్స్ జరుగుతుంటాయి. ఇదంతా సినిమా ఇండస్ట్రీలో కామన్. ఒకప్పుడు శ్రీదేవి, జయప్రద లకు అసలు పడేది కాదని ఇద్దరూ ఒకే సినిమా షూటింగ్ లో ఉన్నా ఎడ మొహం, పెడ మొహంలా ఉండేవారని పలకరించుకునే వారు కాదని అందరికీ తెలుసు. అయితే ఇలా ఇద్దరు హీరోయిన్లు గొడవ పడిన సందర్భాలు పాతతరం హీరోయిన్ల మధ్య కనిపించవు కానీ వాణిశ్రీ, విజయనిర్మల గారి మధ్య మాత్రం ఒక సినిమా విషయంలో బాగా గొడవ జరిగింది. ఈ ఇష్యూ గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మాట్లాడారు.

దేవదాసు సినిమా ఇద్దరి మధ్య గొడవ పెట్టింది…

నాగేశ్వరావు గారి ‘దేవదాసు’ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. బెంగాలీ నవల ఆధారంగా చాలా భాషల్లో తెరకెక్కినా తెలుగులో నాగేశ్వరావు గారు చేసినట్లుగా ఎవరూ చేయలేదనే అభిప్రాయం ఉంది. అలాంటి సినిమాను మరో సారి కలర్ లో తీయాలని కృష్ణ గారు అనుకున్నారు. విజయనిర్మల హీరోయిన్ గా కృష్ణ గారు దేవదాసు సినిమా సినిమా స్కోప్ లో మొదటి సారి తీశారు. చాలా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. దీనికి ముఖ్య కారణం అదే సమయంలో పాత దేవదాసు సినిమాను నాగేశ్వరావు గారు మళ్ళీ విడుదల చేయడం. దేవదాసు హక్కులు ఆయన వద్ద ఉండటంతో పాత దేవదాసు సినిమాను మరోసారి విడుదల చేసి కొత్త దేవాదాడు సినిమాను దెబ్బ కొట్టారు.

ఇక దీనివల్ల నవయుగ పిక్చర్స్ వాళ్ళు కొత్త దేవదాస్ సినిమాను నిర్మించడంతో నష్టపోయారు. నాగేశ్వరావు గారు నవయుగ వారికి కావలసిన వ్యక్తి అలాంటి ఆయన ఇలా చేయడం వల్ల వారు సారథి స్టూడియో లో నాగేశ్వరావు గారిని అడుగుపెట్టనివ్వలేదు. దీంతో నాగేశ్వరావు గారు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించాలని అనుకున్నారు. ఇక ఈ స్టోరీలోకి వాణిశ్రీ ఎలా వచ్చిందనే విషయాన్ని భరద్వాజగారు చెబుతూ వాణిశ్రీ గారు సినిమా ఇండస్ట్రీ తెలుగు మహా సభల కోసం నాటకాలు వేసే సమయంలో నాటకంలో భాగంగా సినిమా ఇది చూడాలనే చర్చ వచ్చినపుడు కొత్త సినిమాల కంటే పాత దేవదాస్ సినిమా చూడటమే మేలు అనే డైలాగు చెప్పడంతో గొడవ వచ్చింది అంటూ చెప్పారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న విజయనిర్మల వాణిశ్రీ గారిని డైరెక్ట్ గా నీలాదీయగా నేను కావాలని అలా చెప్పలేదు అని చెప్పినా విజయనిర్మల ఒప్పుకోకుండా నటీ నటుల సంఘానికి ఫిర్యాదు చేశారు. వాణిశ్రీ ని ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేయలనే వరకు వివాదం వెళ్లినా ఇక అక్కడ జగ్గయ్య గారు ఇరువైపులా రాజీ చేసి గొడవ సద్దుమనిగేలా చేసారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago