Senior Journalist Bhardwaja : టీడీపీ నాయకుడు పరిటాల రవి హత్య కుట్రలో భాగంగా కారు బాంబు పేల్చి హతమార్చాలని ప్రయత్నించినపుడు జరిగిన సంఘటనలను సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు పంచుకున్నారు. అప్పటికే టీవీ బాంబ్ కేసులో జైల్లో ఉన్న మద్దెలచెరువు సూరి శిక్ష అనుభవిస్తున్నా జైలులో ఉంటూనే బయట తన శత్రువు పరిటాల రవి హత్యకు కుట్ర చేసారు. అయితే ఆ బాంబు పేలుడులో దాదాపు 24 మంది మరణించారు. ఎనిమిది మంది నిందితులకు జీవిత ఖైదు విధించారు.
తృటిలో తప్పించుకున్న మోహన్ బాబు, పరిటాల రవి…
పరిటాల రవి తండ్రి పరిటాల శ్రీరాములు జీవిత చరిత్ర సినిమాగా నిర్మించి శ్రీరాములయ్య సినిమా తీయించారు. అయితే ఈ సినిమా విడుదల వేడుక రామా నాయుడు స్టూడియో లో నానక్రామ్ గూడా లో జరిగింది. వేడుక అయిపోయాక తిరిగి వెళ్తున్న సమయంలో ల్యాండ్ మైన్ పేల్చి పరిటాల రవిని చంపడానికి కుట్ర చేసారు. జైలు నుండే తన అనుచరులతో కుట్రకు ప్లాన్ చేసిన సూరి అప్పుడే ఇంజనీరింగ్ అయిన ఒక విద్యార్థి ద్వారా ల్యాండ్ మైన్ ను తయారుచేయించి కారు వచ్చే చోట పెట్టారు.
కారులో పరిటాల రవి, మోహన్ బాబు, పరిటాల రవి గారి బావ కృష్ణ రావు అందరూ కారులో ఉండగా ఆ కారు కంటే ముందు మీడియా వాళ్ళు వెళ్తున్న వాహనం వాళ్ళను ఓవర్ టేక్ చేసి ల్యాండమైన్ మీద వెళ్లడం వల్ల ఆ కారు పేలి అందులో ఉన్న ఇరవై నాలుగు మంది మరణించారు. అలా 1997 లోనే మోహన్ బాబు ఆ కారు ప్రమాదంలో మరణించాల్సి ఉన్నా మీడియా వాళ్ళ వాహనం ఓవర్ టేక్ చేయడం వల్ల బ్రతికారు అంటూ అప్పటి ఇన్సిడెంట్ ను భరద్వాజ గారు చెప్పారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…