Balakrishna: తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు ఎవరూ కూడా రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలను ఇబ్బంది పెట్టరు అనే పేరు నందమూరి హీరోలకు ఉంది.ఒక సినిమా చేసి ఆ సినిమా హిట్ అయితే ఆ సినిమాకు తీసుకున్నంత రెమ్యూనరేషన్ మరో సినిమాకు తీసుకుంటారు. ఒకవేళ పెంచితే ఒక ఐదు శాతం లేదా పది శాతం రెమ్యునరేషన్ పెంచుతారు.
ఇలా రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా సినిమాలలో నటిస్తూ నిర్మాతల హీరోలుగా మెలుగుతూ ఉంటారు.ఇక ఎన్టీఆర్ నుంచి మొదలుకొని బాలకృష్ణ హరికృష్ణ నేటి యువ హీరోలు అయినటువంటి కళ్యాణ్ రామ్ తారక్ వంటి వాళ్లు కూడా నిర్మాతలను రెమ్యూనరేషన్ విషయంలో ఏ మాత్రం ఇబ్బంది పెట్టరు.
ఇకపోతే గతంలో బాలకృష్ణతో తనకు జరిగినటువంటి సంఘటనను గుర్తు చేసుకున్నారు నిర్మాత చంటి అడ్డాల. గతంలో ఆర్ట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి ఈయన ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా పవిత్ర ప్రేమ సినిమా తీశారు.ఈ సినిమా కోసం బాలకృష్ణకు 60 లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత సమరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.ఈ సినిమా హిట్ అయిన తర్వాత చంటి అడ్డాల మరోసారి బాలయ్యను సంప్రదించి తన బ్యానర్లో సినిమా చేయమని అడిగారట.
ఇలా బాలయ్య సమరసింహారెడ్డి వంటి మంచి హిట్ అందుకోవడంతో రెమ్యూనరేషన్ కూడా భారీగానే అడుగుతారని భావించిన చంటి తనతో పాటు రెండు కోట్ల రూపాయల తీసుకువెళ్లారట బాలయ్య బాబు రెండు కోట్లు అడిగితే బ్రతిమలాడి 1.5 కోట్లు రెమ్యూనరేషన్ కి కుదుర్చుకుందామని వెళ్లారట.సినిమా మొత్తం చర్చలు జరిపిన తర్వాత రెమ్యూనరేషన్ గురించి మాట్లాడే సమయంలో తన ముందు సినిమాకు ఎంత తీసుకున్నానో అంతే రెమ్యూనరేషన్ ఇవ్వండి. అని బాలకృష్ణ అనడంతో ఒక్కసారిగా చంటి అడ్డాల ఆశ్చర్యపోయి బాలకృష్ణ గారికి మనసులోనే దండం పెట్టుకున్నారని ఈయన ఓ సందర్భంలో తెలియచేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…