Adithya 369:బాలకృష్ణ తన సినీ కెరియర్లో మొదటిసారి సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఆదిత్య 369. ఈ సినిమా అప్పట్లో ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకుంది. సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో తెలిపిన ఈ సినిమా అప్పట్లోనే దాదాపు రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి తొమ్మిది కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. అదేవిధంగా ఈ సినిమాకు రెండు నంది అవార్డులు రావడం కూడా విశేషం.
ఈ విధంగా ఈ సినిమా బాలకృష్ణ సినీ కెరియర్ లోనే అద్భుతమైన సినిమాగా నిలిచిపోయింది. ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం ఉంటుందని సింగీతం శ్రీనివాస్ చెప్పకనే చెప్పారు.ఇక ఈ సినిమా సీక్వెల్ గురించి పలుమార్లు వినిపించినప్పటికీ ఈసారి మాత్రం ఈ సినిమా సీక్వెల్ ఉండబోతుందని బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా సీక్వెల్ చిత్రానికి కథ సిద్ధం చేసే పనిలో డైరెక్టర్ ఉన్నట్టు సమాచారం.
ఇకపోతే ఆదిత్య 369 సీక్వెల్ చిత్రంగా రాబోతున్న సినిమాకు ఆదిత్య 999అనే టైటిల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాని బాలకృష్ణ స్వయంగా దర్శకత్వం వహించబోతున్నారు. ఇక తాజాగా ఈ సినిమాలు నందమూరి మోక్షజ్ఞ నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలా బాలయ్య డైరెక్షన్లో తన కుమారుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావిస్తున్నారట.
ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కడంతో ఈ సినిమానీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని భావించారట. ఇలా ఆదిత్య 369 సినిమా సీక్వెల్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాలకృష్ణ అభిమానుల సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే త్వరలోనే ఈ విషయం గురించి అధికారకంగా వెల్లడించనున్నారు.
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…
నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…