Featured

Senior Journalist Imandhi Ramarao : అర్జున్ వెర్సస్ విశ్వక్ సేన్… అర్జున్ ప్రెస్ మీట్ తో విశ్వక్ కెరీర్ కి నష్టం… ఆ రోజు రాత్రి జరిగింది ఇదే… తొందరపడి తప్పు చేసింది ఎవరు : ఇమంది రామారావు

Senior journalist Imandhi Ramarao : వర్ధమాన నటుడు విశ్వక్ సేన్.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న విశ్వక్ సేన్ ఈ మధ్య తరచూ వివాదాల్లో ఉంటున్నాడు. ఇప్పుడిప్పుడే హీరో గా ఎదుగుతున్న క్రమంలో మంచి ప్రాజెక్ట్స్ అందుకుంటున్న విశ్వక్ సేన్ తన అవకాశాలను తానే పోగొట్టుకుంటున్నట్లుంది అతని వ్యవహారశైలి. తాజాగా సీనియర్ నటుడు అర్జున్ ఆయన కూతురిని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక తెలుగు సినిమా చేయాలని డిసైడ్ అయి అందులో హీరో గా విశ్వక్ సేన్ బాగుంటాడని అనుకుని విశ్వక్ ను కలిసి కథ వివరించి ఓకే చేసారు. సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉండగా విశ్వక్ వల్ల కొద్ది రోజులు వాయిదా పడింది. ఇక మళ్ళీ తిరిగి షెడ్యూల్ మొదలయ్యే సమయానికి మళ్ళీ విశ్వక్ రాకపోవడం, ఏ కారణం చెప్పకుండా ఉండటంతో అర్జున్ సర్జ ఫిల్మ్ ఛాంబర్ లో ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ ప్రవర్తన ఏం బాగోలేదంటూ మాట్లాడారు. ఇక ఈవిషయంలో విశ్వక్ సేన్ కూడా మీడియా ముందు కు వచ్చారు. ఈ వివాదం వల్ల విశ్వక్ కెరీర్ పోతుందా, అసలు తప్పు ఎవరిది అనే విషయాల మీద సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడారు.

తప్పు అతనిదే…

అర్జున్, విశ్వక్ సేన్ వివాదంలో తప్పు విశ్వక్ సేన్ దే అంటూ ఇమంది రామారావు గారు అభిప్రాయ పడ్డారు. సీనియర్ హీరోగా అర్జున్ ఆయన కూతురు ని పరిచయం చేస్తూ ఆయనే నిర్మాతగా అలాగే డైరెక్టర్ గా తీస్తున్న సినిమాలో విశ్వక్ ను హీరోగా ఎంపిక చేసుకున్నారు. కథ చర్చలు అన్ని అయిపోయాక షూటింగ్ మొదలు పెట్టాక ఒక్కరోజు షూటింగ్ ఆగినా అది నష్టమే అవుతుంది అయినా కానీ విశ్వక్ కోసం ఒకసారి ఆల్రడీ వాయిదా వేసినపుడు మళ్ళీ ఇంకోసారి షూటింగ్ ఎగ్గొడితే ఎవరైనా అర్జున్ లాగానే స్పందిస్తారు.

అయితే విశ్వక్ ముందు రోజు ఒక స్టార్ హీరో పార్టీ కి వెళ్లి ఉదయం లేవలేక పోయానని ఫిల్మ్ యూనిట్ కి మెసేజ్ కు ఇచ్చాను అంటూ చెబుతున్నాడు. అలాగే స్క్రిప్ట్ విషయంలో కొన్ని విబేధాలు ఉన్నాయంటూ చెప్పడం ఇవన్నీ విశ్వక్ వైపు తప్పును చూపిస్తున్నాయి అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు. చేసే పనిలో క్రమశిక్షణ, అంకితభావం లేకపోతే ఎదగలేరు అంటూ అభిప్రాయపడ్డారు. తొందరపడి కెరీర్ లో నష్టపోతున్నాడు అంటూ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago