Featured

Senior Journalist Imandhi Ramarao : అల్లు అరవింద్ లేకపోతే చిరంజీవి పెద్ద సున్నా…? సుమన్ ను తొక్కేసి చిరు ఇండస్ట్రీ లో ఎదిగాడా…? : సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Senior Journalist Imandhi Ramarao : స్వయం కృషి తో ఏ గాడ్ ఫాదర్ లేకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ కొన్ని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న మెగా స్టార్ చిరంజీవి గారు ఇండస్ట్రీ లో కొన్నేళ్లు నెంబర్ వన్ గా నిలిచి ఇండస్ట్రీ ని శాసించారు. ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆ స్థానాన్ని మాత్రం ఎవరు తీసుకోలేక పోయారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ కష్టపడుతూనే ఇంత దాకా వచ్చిన ఆయన విజయానికి వేరేవాళ్ళు కారణం అనడం సమంజసం కాదు అంటూ సీనియర్ సినిమా జర్నలిస్ట్ ఇమంది రామారావు తన విశ్లేషణలో పంచుకున్నారు.

అల్లు అరవింద్ లేకపోతే చిరంజీవి లేడా…..

ఇటీవల సీనియర్ నటుడు చంద్రమోహన్ గారు ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ చిరంజీవి సక్సెస్ కు అల్లు అరవింద్ కారణం. అరవింద్ కృష్ణుడైతే చిరంజీవి అర్జునుడు అంటూ పోల్చారు. మాకు అలాంటి గైడెన్స్ ఉండి ఉంటే కెరీర్ వేరేలా ఉండేది అంటూ చెప్పారు. ఈ విషయం ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. నిజానికి అల్లు కుటుంబం తో సంబంధం కలుపుకునే సరికే చిరంజీవి గుర్తింపు ఉన్న నటుడు. పలు సినిమాలలో నటించి హిట్లందుకుంటూ ఫ్యూచర్ స్టార్ అనిపించుకున్నాడు.

చిరంజీవి వల్ల అల్లు అరవింద్ నిర్మాతగా బాగా సక్సెస్ అయ్యాడు. ఇద్దరు ఒకరి భవిష్యత్ కి ఒకరు సహకరించుకున్నారు. అంతే కానీ చిరంజీవి కష్టం లేకుండా కేవలం అల్లు ఫ్యామిలీ వల్ల స్టార్ అవ్వలేదు అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు. బంగారం గొప్పదా లేక దాన్ని ఆభరణంగా తయారు చేసే స్వర్ణ కారుడు గొప్పవాడ అన్నట్లు గా ఉంది వీరి ఇద్దరి విషయం. ఎంతో ప్రతిభ తో తన నిర్వీరామ కష్టం ఎదిగిన చిరంజీవి ని మధ్యలో వచ్చి సహకరంచిన అల్లు అరవింద్ వల్ల సక్సెస్ అయ్యాడు అనడం తప్పు అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు. ఇక సుమన్ కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు జైలుకి వెళ్లకపోయుంటే మెగాస్టార్ కంటే పెద్ద హీరో అయ్యేవాడు తొక్కేసారు ఇలాంటి మాటలకు ఇమంది గారు స్పందిస్తూ అలా జరుగుంటే నేను ఇలా ఉండేవాడిని ఇవన్నీ అనుకోడానికే బాగుంటాయి. ఇండస్ట్రీ లో ఎవరు ఎవరిని తొక్కేయరు ఎవరి కష్టఫలితం వారికి వస్తుంది. సుమన్ జైలుకి పోకపోయింటే మెగాస్టార్ కంటే పెద్ద హీరో అయ్యేవాడు అనే వాదన కరెక్ట్ కాదు అప్పటికి డాన్స్ అంటే చిరు అనేలా ఇండస్ట్రీ, ప్రేక్షకులు భావించారు. ఆయన ఒక ట్రెండ్ సెట్టర్ అంటూ తెలిపారు ఇమంది రామారావు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago