Senior Journalist Imandhi Ramarao : తెలుగులో గ్లామర్ హీరో అనగానే గుర్తొచ్చేది అప్పట్లో శోభన్ బాబు గారు. అశేష మహిళా ప్రేక్షక ఆదరణ ఆయన నవలనాయకుడిగా పేరు తెచ్చుకున్న శోభన్ బాబు గారు ఆర్థిక క్రమశిక్షణలో కానీ ఆరోగ్యం విషయంలో కానీ అందరికి ఆదర్శమనే చెప్పాలి. తొలిరోజుల్లో ఎంతోమంది కష్టపడి పైకి వచ్చిన ఆయన బాగా డబ్బు సంపాదించిన అంతే ఆర్ధిక క్రమశిక్షణతో మెలిగారు. అలాగే తన పిల్లలను ఇండస్ట్రీ కి దూరంగా పెంచారు. ఆయన తన జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకున్నారో అలానే జీవించి మరణించారు. ఇక ఆయన వ్యక్తిగత జీవితంలోని మరిన్ని విశేషాలను సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు పంచుకున్నారు.
మొదట్లో ఎన్నో కష్టాలు….
శోభన్ బాబు గారు డిగ్రీ పూర్తి అయ్యాక మద్రాస్ కు సినిమాల్లో నటించాలానే కోరికతో వచ్చారు. లా చదువుతూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించారు. మొదట్లో చిన్న చిన్న వేషాలను కూడా వేసారు శోభన్ బాబు గారు. అప్పటికే పెళ్ళై నలుగురు పిల్లలు ఉన్న శోభన్ బాబు గారు ఎంతో కొంత డబ్బు వస్తుంది కదా అని చిన్న వేషం అయిన నటించేవారు. చివరికి ఒక సినిమాలో లీడ్ రోల్ రావడంతో ఆయన ఇక వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా అయింది. స్టార్ హీరోగా ఎదిగారు అంటూ ఇమంది గారు తెలిపారు.
ఇక అయన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఆహారం విషయంలో చాలా కంట్రోల్ లో ఉంటారంటు ఆయన గురించి ఇమంది గారు తెలిపారు. కేవలం పళ్ళు, పెరుగన్నం, సలడ్స్ ఎక్కువగా తీసుకునేవారు అంటూ ఆయన ఆహార అలవాట్లను తెలిపారు. ఇక ఆయన పిల్లలను పేదింటి వారికీ ఇచ్చి పెళ్లి చేయాలని అలా అయితే వారు బాగుంటారని కోరుకున్నారట శోభన్ బాబు గారు. కానీ ఆయన భావించినట్లు వారి పెళ్లిళ్లు జరగలేదు. ఇక ఇండస్ట్రీ కి పిల్లలను తీసుకురకూడదు అనే నిర్ణయం ఎపుడో తీసుకున్నాను అయినా అనుకున్నట్లుగానే కొడుకును ఇండస్ట్రీ కి దూరంగా ఉంచాడు. బాగా ఆస్తులను సంపాదించి పిల్లలను బాగా సెటిల్ చేసారు అంటూ శోభన్ బాబు గారి గురించి తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…