Senior journalist Imandi Ramarao : మెగాస్టార్ చిరంజీవి అలాగే హీరో రాజశేఖర్ ఆయన సతీమణి జీవిత రాజశేఖర్ ల మధ్య కొంత గ్యాప్ ఉన్న విషయం తెలిసిందే. మొదటి నుండి చిరంజీవి గారి ఫ్యామిలీ మీద జీవిత రాజశేఖర్ లు బురద జల్లడం, కొన్నిసార్లు అభిమానుల వల్ల ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. చిరంజీవి గారు సామాజిక సేవలో భాగంగా ఏర్పాటు చేసిన బ్లడ్ బాంక్స్ గురించి కూడా వీరిద్దరూ చేసిన వ్యాఖ్యలకు అల్లు అరవింద్ గారు కోర్ట్ లో పరువు నష్టం దావా వేశారు. నేడు ఆ కేసుకు సంబంధించిన తీర్పు లో జైలు శిక్ష ఖరారు చేయడంతో జీవిత రాజశేఖర్ ఆ శిక్షను తప్పించుకోడానికి పలు మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోందని సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు తెలిపారు.
పవన్ కళ్యాణ్ వద్దకు జీవిత రాజశేఖర్…
తాజాగా జీవిత రాజశేఖర్ కేసు విషయం అయి పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లినట్లు తెలుస్తోందని ఇమంది రామారావు తెలిపారు. అయితే చిరంజీవి అనుమతి లేనిదే పవన్ కళ్యాణ్ గారు కానీ, నాగబాబు కానీ అల్లు అరవింద్ కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోరు. ఆ కేసు వేసింది కూడా అల్లు అరవింద్ గారే. ఆయన చిరంజీవి అనుమతి లేకుండా చిరంజీవి కి తెలియకుండా వేయరు కదా.
వీళ్ళు ఇదంతా చేయకుండా డైరెక్ట్ గా చిరంజీవి గారికి వెళ్లి క్షమాపణ చెబితే అయిపోతుంది కదా, కానీ ఆ పని చేయకుండా ఇటువంటి మార్గాలను ఎంచుకుంటున్నారు అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు. నిరాధారంగా ఆరోపణలను చేస్తే ఇలానే శిక్షలు పడతాయని ఇమంది గారు అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…