Senior journalist Shravan Kumar : ఎలక్షన్ సమయంలో తనిఖీలు, సోదాలు జరగడం మామూలే. దక్షిణాదిన కర్ణాటకలో ఎన్నికల నగారా మోగడంతో సరిహద్ధుల్లో పోలీసులు శాఖ తనిఖీలను ముమ్మరం చేసారు. అనుమానంగా ఉన్న వాహనాలను సీజ్ చేస్తూ విచారిస్తున్నారు. తాజాగా బోనీ కపూర్ కి చెందిన ఒక వాహనం పట్టుబడటంతో అది వార్తల్లో నిలిచింది. చెన్నై నుండి ముంబై వెళ్తోన్న ఈ వాహనంను ప్రస్తుతం సీజ్ చేసి విచారిస్తుండగా ఈ విషయం మీద ఇంత వరకు బోనీ కపూర్ స్పందించలేదు. ఇక ఈ ఇష్యూ మీద సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ మాట్లాడారు.
శ్రీదేవి నగలు స్వాదీనం…
చెన్నై నుండి ముంబైకి వెళ్తోన్న బోని కపూర్ ప్రొడక్షన్ సంస్థకి సంబంధించిన వాహనం కర్ణాటక సరిహద్ధుల్లో తనిఖీ చేయగా నలభై లక్షల విలువ గల వెండి దొరికింది. సుమారు యాభై కేజీలకు పైనే వెండి లభ్యం అవడంతో ఆ వెహికల్ ఎవరిది అని విచారించగా బోనీ కపూర్ కి సంబంధించిన వాహనం అని తేలింది. అయితే ఇవి ఆదాయ పన్ను సోదాలు వంటివి కాదని అదీకాక వాహనం ఆయనది అని తెలిసిందే కానీ ఇంకా బోనీ కపూర్ ను ప్రశ్నించినట్లు బయటికి వార్తలు రాలేదని తెలిపారు అనలిస్ట్ శ్రవణ్ కుమార్.
నిజానికి ఆ వెండి నగలు శ్రీదేవి నగలంటూ బయట ప్రచారం జరుగుతుంది, చెన్నై వదిలి శ్రీదేవి గారు సుమారు 15 సంవత్సరాల పైనే అయింది. తను తెలుగు నటి అయినా చెన్నైలో స్థిరపడింది. అయితే బోనీ కపూర్ తో వివాహం తరువాత తాను ముంబై వెళ్ళిపోయింది. అలా చెన్నైలో పెద్దగా ఆస్తులేవీ లేవని, ఆ వెండి నగలు ఎవరివనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉందని తెలిపారు శ్రవణ్ కుమార్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…