Featured

Senior Producer Chittibabu : తారక రత్న హెల్త్ గురించి బాలకృష్ణ తో మాట్లాడాను… ఆయన ఏం చెప్పారంటే…: నిర్మాత చిట్టిబాబు

Senior Producer Chittibabu : నందమూరి తారక రత్న కుప్పంలో జరిగిన నారా లోకేష్ సభకు హాజరై అక్కడ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకి తరలిండం చకచకా జరిగిపోయాయి. తారక రత్నకు గుండె నొప్పి రావడంతో తనని చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. అక్కడ కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శించడానికి వస్తున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు చెబుతున్నా ఇంకా పరిస్థితి క్రిటికల్ గా ఉందంటూ తెలుస్తోంది. అయితే ఆయన్ను విదేశాలకు తరలిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అసలు ఇందులో ఎంత నిజం ఉంది అనేదాని మీద సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు స్పందించారు.

బాలకృష్ణ తో మాట్లాడాను…

చిట్టిబాబు మాట్లాడుతూ తారకరత్న వైద్యానికి స్పందిస్తున్నారంటూ చెప్పారు. నారాయణ హృదయాలయలో తనకు మెరుగైన వైద్యం అందుతోందని ఇండియాలోనే బెస్ట్ డాక్టర్ తో ట్రీట్మెంట్ జరుగుతోందని చెప్పారు. తారక రత్న ఆరోగ్యం గురించి బయటికి వినిపిస్తున్న వార్తలు వదంతులు అంటూ తెలిపారు. తనని విదేశాలకు తీసుకెళ్తున్నట్లు బ్రెయిన్ డామేజ్ అయిందంటూ చెప్తున్న మాటలు వాస్తవం కాదని వివరించారు చిట్టిబాబు.

బాలకృష్ణ తో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్లు చెప్పారు. వైద్యానికి స్పందిస్తున్నా ఇంకా ప్రమాదం అయితే ఉందని కాకపోతే కళ్ళు తెరిచి చూస్తున్నాడు, స్పర్శ అన్నీ ఉన్నాయి అంటూ చెప్పారు. త్వరలోనే కోలుకొని బయటికి వస్తాడు కానీ వైవీపీ పార్టీ వాళ్ళు ఏవేవో అసత్య ప్రచారాలను చేస్తున్నారు అంటూ చిట్టిబాబు అభిప్రాయపడ్డారు. విషప్రయోగం జరిగింది అంటూ ఏవేవో పుకార్లు పుట్టిస్తున్నారు అవన్నీ నమ్మొద్ధు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

రాజకీయాలకు ఆధ్యాత్మిక టచ్.. విజయ్ వినూత్న ప్రచారం అందరి దృష్టిని ఆకర్షించింది!

తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…

21 minutes ago

చార్‌ధామ్ యాత్ర ప్రారంభం.. యమునోత్రి, గంగోత్రి దర్శనాలకు భారీగా తరలివచ్చిన భక్తులు!

ఉత్తరాఖండ్‌లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్‌ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…

51 minutes ago

నా మాటలను వక్రీకరించారు.. ప్రకాశ్ రాజ్ క్లారిటీ

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…

21 hours ago

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

1 day ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

1 day ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

1 day ago