Aruna Irani: ప్రస్తుత కాలంలో ప్రేమలు పెళ్లిళ్లు బ్రేకప్ లు జరగడం సర్వసాధారణం.ఇలా ప్రేమలో పడిన వెంటనే పెళ్లిళ్లు చేసుకోవడం ఆ బంధాన్ని ఎక్కువ కాలం నిలబెట్టుకోలేక ఎంతో మంది విడాకులు తీసుకుంటున్నారు ముఖ్యంగా ఈ వ్యవహారం ఇండస్ట్రీలో ఎక్కువగా కొనసాగుతుందని చెప్పాలి.అయితే చాలామంది పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మరొకరితో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ ఉన్నారు. అయితే ఇలాంటి వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి మహిళలే కారణం అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంటారు.
ఈ క్రమంలోనే ఇలాంటి వివాహేతర సంబంధాల గురించి నటి అరుణ ఇరానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పచ్చని కుటుంబాలను నాశనం కావడానికి ఆడవాళ్లే కారణమని ఆరోపణలను ఈమె పూర్తిగా ఖండించారు.ఒక మహిళ తన కాపురం కూలిపోవడానికి మరొక మహిళ కారణమని తిడుతున్నారు. అయితే ఇలా తిట్టేముందు మాట్లాడే ముందు ఒక్క నిమిషం ఆలోచించాలని ఈమె తెలిపారు.
మిమ్మల్ని మీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచే బాధ్యత మీ భర్తది వేరే ఆడవాళ్లది కాదు అందుకే ముందుగా మీ భర్తను అదుపులో పెట్టుకోవాలని ఈమె సూచించారు. వేరొకరి కాపురాన్ని కూల్చాలన్న ఉద్దేశంతో ఏ మహిళ కూడా అక్రమ సంబంధం పెట్టుకోదని, ఇతరుల కాపురాలు కూల్చడం మహిళలకు సరదా కాదు అంటూ మండిపడ్డారు.
ఉదాహరణకు ఈమె నటి హేమామాలిని జీవితం గురించి తెలిపారు.కేవలం ధర్మేంద్ర కుటుంబాన్ని నాశనం చేయడం కోసమే హేమామాలిని తనని పెళ్లి చేసుకుందా అని ప్రశ్నించారు. పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత ఒక వ్యక్తితో రిలేషన్షిప్ కొనసాగించడం అంత సులువైన విషయం కాదు.ప్రేమకు ఉన్న సెక్యూరిటీ ప్రస్తుత కాలంలో పెళ్లికి లేదని ప్రేమ లేనిచోట పెళ్లి చేసుకున్న వృధా అంటూ ఈ సందర్భంగా వివాహేతర సంబంధాల గురించి అరుణ ఇరానీ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…