Movie News

Vani Jayaram: వాణి జయరాంకు హైదరాబాద్ తో వీడదీయరానిబంధం ఉందని మీకు తెలుసా?

Vani Jayaram: ఎన్నో భాషలలో,వేల సినిమాలలో సుమారు 20 వేలకు పైగా పాటలను పాడి ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్న లెజెండరీ సింగర్ వాణీ జయరాం మృతి ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. ఈమె చెన్నైలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇలా వాణి జయరాం మరణించడంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ఈమె మృతి పై స్పందిస్తూ తనకు నివాళులు అర్పిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈమె గురించి పలు విషయాలు కూడా బయటకు వస్తున్నాయి.సింగర్ గా ఇండస్ట్రీలోకి రాకముందు ఈమె మద్రాస్ లోనే ఎస్బిఐ బ్యాంకులో పనిచేసేవారు అనంతరం తను హైదరాబాద్ కోటిలోని ఎస్బిఐ బ్రాంచ్ కు బదిలీ అయ్యారు.తన సోదరుడు హైదరాబాదులోనే పనిచేస్తుండడంతో ఈమె కూడా ఇక్కడే విధులు నిర్వహించారు.

ఇక జయరాంతో తన వివాహం సికింద్రాబాద్ లోనే జరిగింది.ఈ క్రమంలోనే ఈమె గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని హైదరాబాద్ తో తనకు ఉన్నటువంటి ప్రత్యేకమైన అనుబంధం గురించి తెలియజేశారు. నా మనసులో హైదరాబాద్ కి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ నగరంతో నాకు జన్మజన్మల అనుబంధం ఉంటుందనిపిస్తుంది.

Vani Jayaram: హైదరాబాద్ నగరంతో విడదీయలేని అనుబంధం…

తన అసలు పేరు కలైవాణి. ఇక్కడ జయరాం అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో తాను వాణి జయరామ్ గా మారిపోయానని తెలిపారు. అయితే తన భర్త ఉద్యోగ నిమిత్తం తనతో పాటు కలిసి ఈమె ముంబై వెళ్ళిపోయారు. ఇక తాను ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత పీబీ శ్రీనివాస్ అవార్డు, పి.సుశీల ట్రస్టు పురస్కారం, ఫిలింఫేర్ ఫర్ సౌత్ నుంచి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు, సత్కారాలన్నీ హైదరాబాద్‌లోనే అందుకున్నాను అంటూ హైదరాబాద్ తో తనకు ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్పుకు వచ్చారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago