విడాకులు.. ఈరోజుల్లో విడాకులు చాలా కామన్ అయిపోయింది. అందులోను సినిమా వాళ్ళు అయితే మరి దారుణం. కలిసున్నంత సేపు పట్టడం లేదు విడిపోవడానికి. వాళ్లెప్పుడు కలుస్తారో.. ఎప్పుడు విడిపోతారో కూడా ఎవరికీ అర్ధం కావడంలేదు. ఒకరినొకరు అర్ధం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. కొన్నేళ్ల కాపురం కూడా సింపుల్ గా తెగదెంపులు చేసుకుంటున్నారు. తాజాగా మలయాళం మరియు తమిళ సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకున్న నటి మేఘన విడాకులు తీసుకుంది. తమిళనాట పొన్మాగల్ వందాల్, అవలుమ్ నానుమ్, సోలోమాన్, దేవమ్ తందా వీడు వంటి సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది మేఘన.
2017లో డాన్ టోమీని పెళ్లి చేసుకున్న మేఘన వారం రోజుల క్రితం తన భర్త తో విడాకులు తీసుకుందని తెలుస్తోంది. అయితే పెళ్లి తర్వాత నటనకు చాలా దూరంగా ఉంది.. కానీ రీ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటుంది మేఘన అప్పట్లో వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. కానీ రెండేళ్ళకే విడిపోవాల్సివచ్చింది. వీరిద్దరి మధ్య మనస్పర్థల కారణంగా ఏడాది కాలంగా వీరిద్దరూ విడివిడిగానే ఉంటున్నారట.. అయితే మేఘన మాజీ భర్త డాన్ టోమీని కూడా మరో పెళ్లికి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది. ఇక మేఘన కూడా తనతో సహనటుడైన విక్కీతో ప్రేమాయణంలో మునిగితేలుతుందని.. త్వరలోనే వీరిద్దరూ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతోన్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే మాజీ భర్తతో విడాకులకు కారణం కూడా మేఘన విక్కీ ల ప్రేమాయణమే అని తెలుస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…