Featured

Serial actress Divya : నా ముందే నా భర్తను ముద్దు పెట్టుకుంది… నన్ను కొట్టింది… భర్త, మరో నటి పై ఆరోపణలు చేసిన సీరియల్ నటి…!

Serial Actress Divya : పెళ్లి చేసుకోవడం, విడిపోవడం ఎంత కామన్ అయిపోయాయో అలాగే సహజీవనం అంటూ ఇద్దరు కలిసి ఉండటం, అలాంటి పార్టనర్ నమ్మి మోసపోవడం, పోలీసులను ఆశ్రయించడం వంటివి కూడా నేటి సమాజం లో కామన్ అయిపోయాయి. ఇక సినిమా, టీవి రంగంలో ఇలాంటివి కోకొల్లలు. తమిళ ఇండస్ట్రీ కి చెందిన ఒక టీవీ నటి కూడా ఇప్పుడు పోలీసులను ఆశ్రయించింది. తన భర్త తనను దూరం పెడుతున్నాడంటూ ఫిర్యాదు చేసింది. వేరే అమ్మాయితో ఆఫైర్ నడుపుతున్నాడని కేసు పెట్టింది.

నా ముందే నా భర్త ను ముద్దు పెట్టుకుంది…

తమిళ సీరియల్స్ లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి దివ్య, ఆర్నవ్ అనే మరో సీరియల్ నటుడిని పెళ్లి చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే దివ్య మొదటి భర్త నుండి విడాకులు తీసుకున్నాక 2017 లో కిలాడి కన్మణి సీరియల్ లో నటించినపుడు ఆర్నవ్ తో పరిచయం ఏర్పడి అది స్నేహంగా మారిందని, అప్పటికే దివ్యకు విడాకులయి ఒక ఏడాది పాప కూడా ఉందని, ఆ తరువాత ఐదు సంవత్సరాలు సహజీవనం చేసాక ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. పెళ్లి తరువాత లాక్ డౌన్ సమయంలో కూడా మొత్తం బాధ్యత తానే తీసుకున్నట్లు దివ్య పేర్కొన్నారు. తాను ఏ పని చేసేవాడు కాదని ఇద్దరం కలిసి ఇల్లు కొన్నా అందుకోసం తన నగలను అమ్మినట్లు దివ్య చెప్పారు.

తమ పెళ్లి విషయంలో కానీ ఫోటోలను కానీ బయట చూపించ వద్దని చెప్పేవాడు అంటూ, ప్రస్తుతం తాను ప్రెగ్నెంట్ అయ్యాక దూరం పెడుతున్నాడని ఈ సమయంలోనే తాను వేరే అమ్మాయి తో ఎఫైర్ నడుపుతున్నట్లు తెలిసిందని దివ్య చెప్పారు. తను నటిస్తున్న సీరియల్ లో ఒక అమ్మయి తో ఆర్నవ్ కి ఎఫైర్ ఉందని నిలాదీయడానికి వెళితే ఇద్దరూ ఒకే రూమ్ లో ఉంటున్నారని తెలిసింది. అర్ణవ్ తో మాట్లాడుతుంటే ఆ అమ్మాయి కొట్టిందని తన ముందే ఆర్నవ్ కు ముద్దు కూడా పెట్టిందని దివ్య పేర్కొన్నారు. ఆర్నవ్ కోసం తన మతం మార్చుకున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు తనకు న్యాయం చేయాలని, తనకు కానీ తన కడుపులోని బిడ్డకు కానీ ఏదైనా హాని జరిగితే ఆర్నవ్ దే బాధ్యత అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

44 డిగ్రీలకు చేరే ఉష్ణోగ్రతలు.. మూడు రోజులు హెచ్చరిక

తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…

2 hours ago

ప్రభాస్ ‘ఫౌజీ’ ఛాన్స్ వదిలేసిన టాలీవుడ్ హీరో ఎవరు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…

2 hours ago

180 బాధితులు.. దేశాన్ని షాక్‌కు గురిచేసిన ఘటన

మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…

2 hours ago

వరుణ్ తేజ్ గాయం.. నిహారిక ఎమోషనల్ ప్రెస్ నోట్

టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…

3 hours ago

అటెండర్ మాస్టర్ ప్లాన్.. SBIకి రూ.2.65 కోట్ల షాక్!

తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…

5 hours ago

ఎన్నికల వేళ ఆస్తుల వివాదం.. ఉదయనిధిపై విచారణ

తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…

6 hours ago