Movie News

ప్రముఖ సీరియల్ నటి పల్లవిని.. ఆ పని చేసినందుకు బ్యాన్ చేశారట..

పల్లవి గౌడ ప్రముఖ తెలుగు సీరియల్ నటి. ఆమె 1993 లో సెప్టెంబర్ లో కర్ణాటకలో జన్మించారు. మొదట ఆమె 2010 సంత్సరంలో ‘మనే ఒండు మూర్’ ఈటీవీ కన్నడలో ప్రసారం అయిన సీరియల్ లో నటించారు. అప్పటి నుంచి ఆమె బుల్లితెర ప్రస్థానం మొదలైంది. ఇక తెలుగు విషయానికి వస్తే.. 2011 నుంచి 2014 వరకు ప్రసారం అయిన ‘పసుపు కుంకుమ’ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయం అయ్యారు.

తర్వాత 2014 లోనే సావిత్రి అనే సీరియల్ లో కూడా ఆమె నటించారు. తర్వాత తెలుగుకు మళ్లీ దూరం అయి కన్నడం, మళయాలంలో ఎన్నో రకాల సీరియల్స్ ను చేసింది. ప్రస్తుతం పల్లవి.. తెలుగులో రెండు సీరియల్స్ లో నటిస్తోంది. అందులో ఒకటి చదరంగం.. మరొకటి సూర్యాకాంతం. చదరంగంలో కొంచెం నెగెటీవ్ రోల్స్ లో నటిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఆమెను ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో బ్యాన్ చేశారని ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది. ఎందుకంటే.. సావిత్రి సీరియల్ లో నటించే క్రమంలో అప్పుడు మరే సీరియల్ నటించనని అగ్రిమెంట్ తీసుకున్నారట. ఆమె కూడా దానికి ఒప్పుకొని సంతకం కూడా చేసింది.

కానీ వాళ్లు అదే అదునుగా భావించి చేసిన పనికి కనీసం పేమెంట్ ఇవ్వకుండా తిప్పారని.. అందుకే తాను మరో సీరియల్ చేయడానికి చేసేందుకు సిద్ధం అయినట్లు పేర్కొన్నారు. ఇచ్చిన అగ్రిమెంట్ ను బ్రేక్ చేసినందకు ఆమెపై బ్యాన్ విధించినట్లు ఆమె చెప్పారు. తర్వాత చాలా రోజుల తర్వాత మళ్లీ తెలుగులో ఆమె చదరంగం, సూర్యాకాంతం అనే సీరియల్స్ లో నటిస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago