బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో సరయు ఒకరు. ఆమె సెవెన్ ఆర్ట్స్ ఆనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితం. ఆ ఛానల్ లో ఎంతో బోల్డ్ మాట్లాడే సరయు.. హౌస్ లోకి వెళ్లిన మొదటి వారం రోజులు డిగ్నిటిగా ఉన్నారు. శనివారం నాగార్జున మాట్లాడే సమయంలో కూడా బూతులు మాట్లాడటం లేదు ఎందుకు సరయు.. అని అడిగితే.. మీరు తిడతారని చేయలేదు సార్ అని సమాధానం ఇస్తుంది.
అయితే ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏంటంటే.. హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆమె ఒకరు ఒక వైపు.. మిగతావారందరూ ఒకవైపు అన్నట్లుగా వ్యవహరించారాని ఆమె అభిప్రాయపడ్డారు. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె అదే చెప్పారు.
బిగ్ బాస్ బజ్ లో అయితే ప్రతీ కంటెస్టెంట్ ను బూతు పురాణంతో ఒక ఆట ఆడుకుంది. బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా చేసిన అరియానా అలానే చూస్తూ ఉండిపోయింది. ముఖ్యంగా సిరి, షణ్ముఖ్ ఫొటోలను విరిచి పారేసింది. ఇంటి నుంచి బయటకు పంపించారన్న కోపం ఆమె విపరీతంగా తీర్చుసుకుంది. ఇదిలా ఉండగా.. ఆమె ఎలిమినేట్ అయిన దగ్గర నుంచి ఒక వారం రోజులకు ఆమెకు బిగ్ బాస్ నిర్వాహకులు రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే ఆమె అభిమానులు మాత్రం సరయు ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. బిగ్ బాస్ నిర్వాహకులు టార్గెట్ చేసి పంపించేశారని ఆరోపిస్తున్నారు. అయితే ఆమె ఎలిమినేషన్ కు ప్రధాన కారణం నామినేషన్స్‌లో ఉన్నప్పుడు మిగతా కంటెస్టెంట్లతో పోటీ పడుతూ ఆడాలి. స్క్రీన్ స్పేస్ కోసం ప్రయత్నించాలి. కానీ సరయూ ఈ రెండూ చేయలేదనే తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…