‘అపరంజి’ బొమ్మగా ఆకట్టుకుని, ‘ఇద్దరమ్మాయిలు’ తో మెప్పించి, ‘అష్టాచెమ్మా’ ఆడేసి, ఇప్పుడు ‘నా కోడలు బంగారం’ అనిపించుకుంటున్న సుహాసిని తెలుగమ్మాయి. పరిచయం అక్కర్లేని నటి. వెండితెర నుంచి బుల్లితెర వైపుగా టర్న్ తీసుకొని అందమైన అభినయంతో మెప్పిస్తున్న సుహాసినిని చాలామంది ఆమె నటించిన సీరియల్స్ లోనీ పాత్రల పేర్లతోనే పిలుస్తుంటారు. కానీ, ప్రేక్షకులెప్పుడూ ‘సుహాసిని’గానే గుర్తుంచుకున్నారు.
నెల్లూరు జిల్లాలో వెంకటరెడ్డి, జ్యోతి దంపతులకు 1983 మే 26 జన్మించిన సుహాసినికి అనుదీప్ అనే తమ్ముడున్నాడు. సుహాసిని నటించిన తొలి చిత్రం ‘చంటిగాడు’ తోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ‘చంటిగాడు’ చిత్రంలో నటించే సమయానికి సుహాసిని 10th క్లాస్ చదువుతుందంటే ఆశ్చర్యం కలుగకమానదు. ఆ చిత్రంలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యే టైమ్ కి సుహాసినికి సినిమా నటన గురించి పెద్దగా అవగాహన లేదనే చెప్పాలి. అలాగని పెద్దగా ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ కూడా లేదు. టాలీవుడ్ లో పనిచేసే కొందరి ఫొటోగ్రాఫర్స్ ద్వారా సుహాసిని ఫొటోలు టాలీవుడ్ దర్శకురాలు జయగారి దగ్గకు వెళ్లాయి. ఆవిడ సుహాసిని ఫొటోలను చూడగానే ఊరు, పేరు అడక్కుండా, స్క్రీన్ టెస్ట్ చేయకుండా ఈ అమ్మాయే నా సినిమాలో హీరోయిన్ అంటూ ఫిక్సై పోయిందట. ఆవిధంగా సుహాసిని టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వాస్తవానికి తమ కూతురు సినిమాల్లో నటించడమంటే సుహాసిని అంటే పేరెంట్స్ కి ఇష్టం లేకపోయినా, ‘చంటిగాడు’ చిత్రం సక్సెస్ సాధించడంతో వాళ్ళు ఒకే చెప్పారు. ఆ తర్వాత లక్ష్మీ కళ్యాణం, అడ్డా, దోస్త్ వంటి 30 చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సుహాసిని తెలుగు, తమిళ్, కన్నడ చిత్రాలలో నటించింది.
2003లో ‘అపరంజి’ సీరియల్ ద్వారా వెండితెర నుంచి బుల్లితెరకి పరిచయమైంది సుహాసిని.
పుట్టి పెరిగిందంతా నెల్లూరు లోనే అయినా.. సుహాసిని అమ్మ గారి ప్రోత్సాహంతో డ్యాన్స్ నేర్చుకుంది. జీ టీవీ సహకారంతో ‘ప్రేమ, నా కోడలు బంగారం’ సీరియల్స్ తో ప్రొడ్యూసర్ గా మారింది సుహాసిని. అనుబంధాలు, అష్టాచెమ్మా, ఇద్దరమ్మాయిలు, గిరిజా కళ్యాణం, నా కోడలు బంగారం వంటి సీరియల్స్ లోనూ కొన్ని తమిళ సీరియల్స్ లో నటించింది.
ఫ్యామిలీ పరంగా సుహాసిని నాన్నగారు, సుహాసిని భర్త సపోర్ట్ ఉండటంతో ఆర్టిస్టుగా, ప్రొడ్యూసర్‌గా బిజీ అయిపోయింది ఈ అపరంజి బొమ్మ. 2011లో బెస్ట్ యాక్ట్రిస్ అవార్డును కూడా అందుకుంది. ‘ఇద్దరమ్మాయిలు’ సీరియల్ లో నటిస్తున్నప్పుడు సుహాసిని తన సహ నటుడైన ధర్మతో ప్రేమలో పడింది. పెద్దల అంగీకారంతోనే ధర్మను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సుహాసిని తన భర్తతో కలిసి సీరియల్స్ లో నటించలేదు. ‘ఇద్దరమ్మాయిలు’ సీరియల్ లో మాత్రం ఇద్దరూ పోటా పోటీగా నటించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…