Featured

Shaking Sheshu : జబర్దస్త్ వల్ల టీం లీడర్లందరూ ఎంత సంపాదించారంటే : షేకింగ్ శేషు

Shaking Sheshu : జబర్దస్త్ మీద విమర్శలు వివరణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో అసలు జబర్దస్త్ వల్ల జబర్దస్త్ ఆర్టిస్టులకు జీవితం వచ్చిందా లేక జబర్దస్త్ కి వీళ్ళ వల్ల లాభం వచ్చిందా అనే సంశయం మొదలైంది. కిర్రాక్ ఆర్పి ఇలాంటి ఆరోపణలే చేసాడు. జబర్దస్త్ వల్ల మాకు లైఫ్ రావడమేమో కానీ జబర్దస్త్ కు మంచి లైఫ్ ఇచ్చాము మేమందరం. మా జీవితాలను జబర్దస్త్ కోసం పణంగా పెట్టాము అంటూ మాట్లాడాడు. ఇక వీటిపై జబర్దస్త్ కంటెస్టెంట్ షేకింగ్ శేషు స్పందించాడు.

టీం లీడర్లు ఎంత సంపాదించారో తెలుసా…

జబర్దస్త్ చాలా మంది కమెడియన్స్ కి జీవితాన్నిచ్చింది, ఇది కాదనలేని విషయం. అసలు ఎవరో తెలియని వ్యక్తులను ఈరోజు స్టార్ కమెడియన్స్ ను చేసింది. సినిమాల్లో, ఈవెంట్లలో జబర్దస్త్ వాళ్లదే హవా. అలాంటి జబర్దస్త్ లో కంటెస్టెంట్స్ ఏమాత్రం సంపాదిస్తున్నారో అనేది చాలా మంది తెలుసుకోవాలనే విషయం. ఇక షేకింగ్ శేషు మాట్లాడుతూ జబర్దస్త్ షో వల్ల టీం లీడర్లు బాగా సంపాదించుకున్నారు. అందరూ జబర్దస్త్ కి వచ్చాక ఇల్లు కట్టుకుని సెటిల్ అయ్యారు. జబర్దస్త్ తో పాటు ఈవెంట్లు, సినిమాలు వంటివి చేస్తూ బాగా సంపాదిస్తున్నారు.

లక్షల్లో సంపాదన ఉంటోంది అంటూ చెప్పాడు. జబర్దస్త్ చేస్తూ బయట ఈవెంట్లు, సినిమాలు చేయడానికి మల్లెమాల వాళ్ళు అనుమతి ఇస్తారని, చాలా మాది కమెడియన్స్ ఈవెంట్ల ద్వారా బాగా సంపాదిస్తారని చెప్పాడు. ఇక ఇలాంటి విషయాలనే అప్పారావు కూడా చెప్పడం విశేషం. జబర్దస్త్ లో టీం లీడర్ కాకుండా కంటెస్టెంట్ కి వచ్చే పేమెంట్ కంటే ఈవెంట్ల ద్వారా ఎక్కువ సంపాదిస్తారని చెప్పాడు. చాలా ఊర్లు తిరుగుతూ ఈవెంట్లలో పాల్గొన్నామని జబర్దస్త్ క్రేజ్ అలా వుంటుందని చెప్పాడు. ఇక షేకింగ్ శేషు సినిమాలు ఈవెంట్లు వస్తున్నాయంటే అది జబర్దస్త్ వల్లే మరి అలాంటి జబర్దస్త్ ను, మల్లెమాల సంస్థను కేవలం తిండి బాగోలేదని విమర్శించడం తప్పు అంటూ మాట్లాడారు.

Bhargavi

Recent Posts

పెరుగులో ఉప్పు మంచిదా? చక్కెర మంచిదా? ఆరోగ్య నిపుణులు చెప్పే అసలు నిజం ఇదే!

భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…

38 minutes ago

బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ దేశాలకు వెళ్లితే పసిడి కథే వేరు..

ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…

44 minutes ago

ఔను.. నేను అమ్మను కాబోతున్నా.. అభిమానులకు శుభవార్త చెప్పిన సమంత

దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…

52 minutes ago

ఏనుగు పేడ కూడా సూపర్ టేస్టే! కప్పు కాఫీ తాగాలంటే లక్షలు కావాలి..

ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…

8 hours ago

పోషకాల ఖజానా అయిన పనస గింజలు…ఎందుకు పారేస్తున్నారు?

పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…

1 day ago

జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా..? నిజం ఏంటి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…

1 day ago