యూట్యూబర్ గా పలు వీడియోలు,వెబ్ సిరీస్ లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నటించిన వెబ్ సిరీస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచాయి. షణ్ముఖ్ సంబంధించిన వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ అయిందంటే కొన్ని రోజుల పాటు టాప్ వన్ ప్లేస్ లో ట్రెండింగ్ అవుతూ ఉంటుంది. ఇలా ఎంతో ప్రేక్షకాదరణ పొందిన షణ్ముఖ్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లోకి అడుగుపెట్టారు.
ఇలా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన షన్నుతో కలిసి మైండ్ గేమ్ ఆడుతున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. షన్ను సైలెంట్ గా ఉంటూనే హౌస్ లో పావులు కదుపుతున్నారు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ఏడు వారాలు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం 8వ వారంలోకి అడుగుపెట్టింది.
ఇక 8వ వారం కెప్టెన్ గా షన్ను ఎంపికయ్యారు. ఈ క్రమంలోనే ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యుల నుంచి వచ్చిన లెటర్లను వదులుకున్న వారు నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ వారం రవి, షణ్ముఖ్, సిరి, లోబో, మానస్, శ్రీ రామచంద్ర నామినేషన్ లో ఉన్నారు.
అయితే పలు వెబ్సైట్లు చేసిన సర్వే ప్రకారం ప్రతి వారం ఓట్ల పరంగా షణ్ముఖ మొదటిస్థానంలో ఉండేవాడు. తాజాగా అతని గ్రాఫ్ పడిపోయిందని పలు వెబ్సైట్లు సర్వేలు తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలోనే మొదటి స్థానంలో ఉన్న షణ్ముఖ్ ను వెనక్కి తోసి శ్రీరామచంద్ర మొదటి స్థానాన్ని ఆక్రమించుకున్నారని పలు సర్వేలు వెల్లడించాయి. ఇక రెండవ స్థానంలో షణ్ముఖ్ ఉండగా మూడవ స్థానంలో మానస్ ఉన్నారు. అయితే ఈ వారం ఎక్కువగా లోబో నామినేట్ అవుతారంటూ సోషల్ మీడియాలో కథనాలు వినబడుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…