బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం ఇక రెండు రోజులలో తొమ్మిదవ వారం కూడా పూర్తి చేసుకొనుంది. ఈ కార్యక్రమం ద్వారా కంటెస్టెంట్ లు ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతున్నారు. ఇకపోతే నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో భాగంగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇందులో కొన్ని మనస్పర్థల కారణంగా సిరి, షణ్ముఖ్, మానస్, పింకీ మధ్య ఎడబాటు వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే సిరి అందరి బట్టలు తీసి బయటకు విసరగా ఎందుకు అలా విసిరావంటూ షణ్ముఖ్ అడగడంతో ఎవరి బట్టలు వారిని తీసుకోమని చెప్పు అని అంటుంది. ఆ సమయంలో నువ్వే కదా వేసింది నీకు ఉంటది కదా అంటూ షన్ను చెప్పుకొచ్చాడు. అందుకు సిరి నేను తీయను ఎవరి బట్టలు వాళ్ళని తీసుకోమని చెప్పడంతో షణ్ముఖ ఇక్కడే నీ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోతుంది అంటూ సిరిని అంటాడు.
ఆ సమయంలో రవి కల్పించుకుని క్యారెక్టర్ గురించి ఎందుకు అంటూ అనగా మధ్యలో నువ్వు మాట్లాడకు నేను సిరితో మాటాడుతున్నా అంటూ షణ్ముఖ్ రవి పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సమయంలోనే సిరి బాధపడుతూ ఈ దెబ్బల కన్నా నువ్వు అనే మాటలు ఎక్కువగా నొప్పి కలిగిస్తున్నాయి. నేను ఎవరికోసమో ఇక్కడికి రాలేదు నా కోసం నేను ఆడటానికి వచ్చాను అంటూ బాధపడుతుంది.
ఇక గార్డెన్ ఏరియాలో మానస్, పింకీ మాట్లాడుతూ కూర్చోగా..మానస్ మాట్లాడుతూ నీకు ఎవరైనా హాని కలిగిస్తే వారు నాశనం కావాలని కోరుకుంటావు కదా అంటూ పింకినీ అనడంతో పింకీ బాధపడుతూ ఇంకోసారి అలాంటి వర్డ్స్ వాడకు మను వినడానికి కూడా చాలా బాధగా ఉన్నాయి అంటూ అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్తుంది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…