AP Politics: జగన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల.. పసుపు చీర వేసుకుంటే తప్పేంటంటూ?

AP Politics: వైయస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ స్వలాభం కోసం సొంత చెల్లెల పట్ల తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పులివెందులలో నిర్వహించినటువంటి సభలో భాగంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడారు వివేకానంద హత్య కేసులో అవినాష్ రెడ్డిని అనవసరంగా ఇరికిస్తున్నారని ఆయనపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.

వివేక బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డి తప్పు ఏమాత్రం లేదని ఆయన తప్పు లేదని తెలిసి తాను టికెట్ ఇచ్చానని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా తన సొంత చెల్లెలు వైఎస్ఆర్ షర్మిల గురించి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన తండ్రిని చంపినటువంటి శత్రువులతో కలిసి షర్మిల చేతులు కలిపిందని తెలిపారు.

పచ్చ చీర కట్టుకొని శత్రువుల వద్దకు వెళ్లి మోకరిల్లింది అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై షర్మిల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగనన్న ఇలా ఒక ఆడబిడ్డ గురించి తన ఒంటిపై ఏ రంగు చీర ఉంది అనే విషయం గురించి వేల సంఖ్యలో మగవారి ముందు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని ఈమె ప్రశ్నించారు.

రాజకీయాల కోసం దిగజారిన జగన్..

ఇప్పటివరకు సొంత చెల్లెలు ఒక ఆడబిడ్డ అయినటువంటి తనపై తన పేటీఎం కుక్కలు సోషల్ మీడియాలో నన్ను విమర్శించింది సరిపోలేదని నేడు అంత మంది మగవారి ముందు తన ఒంటిపై వేసుకున్నటువంటి చీర రంగు గురించి మాట్లాడటం కరెక్టేనా అంటూ ప్రశ్నించారు. పసుపు రంగు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంత భయం టిడిపి పసుపు రంగును కొనుకుందా మనం వంటల్లోకి ఉపయోగించేది కూడా పసుపు రంగే కదా నేను పసుపు పచ్చ చీర కట్టుకుంటే తప్పేంటి అంటూ ఈమె ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక ఈ విషయంలో షర్మిలకు భారీ స్థాయిలో మద్దతు లభించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి స్థాయి దిగజారి పోయిందంటూ పలువురు ఈ కామెంట్ల పై విమర్శలు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago