Sharwanand: గత కొద్ది రోజులుగా టాలీవుడ్ హీరో సిద్ధార్థ అతిథి రావు హైదరి ఇద్దరు రిలేషన్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.ఇలా ఈ జంట గురించి ఇలాంటి వార్తలు రావడానికి కారణం లేకపోలేదు వీరిద్దరూ కలిసే పలుసార్లు మీడియా కంటపడటమే కాకుండా అదితి పుట్టినరోజు సందర్భంగా నా హృదయపూర్వక యువరానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ సిద్ధార్థ్ పోస్ట్ చేయడంతో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే వార్తలు పుట్టుకొచ్చాయి.
ఇకపోతే సిద్ధార్థ్ అతిధి ఇద్దరు కలిసి మహాసముద్రం సినిమాలో నటించారు. వీరిద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. అయితే తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నటువంటి శర్వానంద్ వీరిద్దరి రిలేషన్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా బాలయ్య శర్వానంద్ ప్రశ్నిస్తూ మీ సినిమాలో హీరోయిన్లను ఎలా ఎంపిక చేసుకుంటారని ప్రశ్న వేశారు.
ఈ ప్రశ్నకు శర్వానంద్ సమాధానం చెబుతూ హీరోయిన్ల విషయంలో నా ప్రమేయం ఏమాత్రం ఉండదని డైరెక్టర్లు ఎలా చెబితే అలా చేయడమేనంటూ సమాధానం ఇచ్చారు. మరి అదితీ సంగతి ఏంటి అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు శర్వానంద్ సమాధానం చెబుతూ మహాసముద్రం సినిమాలో తను నటించింది అయితే తాను సిద్ధార్థ్ కి జంటగా నటించిందని తెలిపారు. శర్వానంద్ ఇలా చెప్పగానే రియల్ లైఫ్ లో కూడా ఆమె సిద్ధార్థకి జంటగా మారిందా అని ప్రశ్నించడంతో శర్వానంద్ నాకు తెలియదు అంటూ సమాధానం చెప్పారు.
వీరి రిలేషన్ గురించి తనకు తెలియదని చెప్పినప్పటికీ ఇంస్టాగ్రామ్ లో మాత్రం తను హృదయపూర్వక యువరాణి అని పోస్ట్ చేసినప్పుడు నాకు కూడా వారు రిలేషన్ లో ఉన్నారేమో అనిపించింది అంటూ ఈయన వారిద్దరి రిలేషన్ గురించి సమాధానం చెప్పారు. అంటే పలికిందంటావా అంటూ బాలయ్య అడగ్గా.. అందుకు శర్వా ఏమో పలికిందేమో అటు శర్వానంద్ సమాధానం చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…