Categories: General News

ఓ వైపు భర్తతో కాపురం చేసి.. మరో వైపు ప్రియుడితో రాసలీలు సాగించింది.. చివరకు ఏమైందంటే..?

ఇద్దరు పిల్లల తల్లి… 22 ఏళ్ల కాపురం.. అయినా సంతోషకరమైన జీవితాన్ని వదిలి తనకు నచ్చిన వ్యక్తితో వెళ్లిపోయిందో మహిళ. ఆ మహిళ కోసం అటు భర్త, ఇటు ప్రియుడు నాకంటే నాకంటూ కొట్టుకుంటున్న ఘటన హైదరాబాద్, హన్మకొండ పీఎస్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే హన్మకొండ టీచర్స్ కాలనీలో ఉంటున్న లంకా శశికాంత్ (42), భార్య దుర్గా సుశీల, అలియాస్ నాగసాయి వెంకట దుర్గా సత్యవతి(35) భార్య భర్తలు. వీరిద్దరికి ఒక కుమారుడు(16), కుమార్తె (13) ఉన్నారు.

శశికాంత్ కు, దుర్గా సుశీలకు 1999లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. శశికాంత్ అర్చకుడిగా ఓ దేవాలయంలో పనిచేస్తున్నాడు. అయితే ఈ ఏడాది ఆగస్టు 20న పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పిన సుశీల ఇంట్లో నుంచి 10 తులాల బంగారం, 25 తులాల వెండి ఆభరణాలు, లక్ష రూపాయల నగదు తీసుకుని ఆమె ఉడాయించింది.  భార్య కోసం చాలా చోట్ల వెతికినా ఆమె జాడ కనిపించలేదు. చివరకు ఏపీలోని అమలాపురం, కొత్తపేటకు చెందిన డ్యాన్సర్ రాయుడు సత్యప్రసాద్ తో వెళ్లిపోయిందని తెలిసింది.

భార్య బంగారం, నగలుతో పారిపోయిందని స్థానిక సుబేదారి పోలీస్ స్టేషన్ లో శశికాంత్ ఫిర్యాదు చేశారు. అయితే వీరిద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చిన పోలీసులు వీరిమధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిచారు. కాగా తనకు పెళ్లి కాలేదని.. శశికాంత్ తన  భర్త కాదని, అక్క చనిపోతే చుట్టం చూపుగా వచ్చానని.. ఈ పిల్లలు నాకు పుట్టలేదని సమాధానం ఇచ్చింది సుశీల. అయితే పోలీసులు విచారణ జరపగా.. దుర్గా సుశీల, శశికాంత్ భార్యే అని తేలింది.

ఇదిలా ఉంటే ప్రియుడు సత్యప్రసాద్ తో కలిసి హైదరాబాద్ బల్కంపేట ప్రశాంత్ నగర్ లో కాపురం పెట్టి.. సహ జీవనం చేయసాగారు. కాగా ఈనెల తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన సామూహిక వివాహాల్లో సుశీలను, సత్య వరప్రసాద్ పెళ్లి చేసుకోవడం కొసమెరుపు. ఈ క్రమంలో మళ్లీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు భర్త. తన పిల్లలకు తల్లి ప్రేమ కావాలని.. నా భార్యను నాకు అప్పగించండి అని వేడుకున్నాడు. కాగా ఇదిలా ఉంటే రెండో భర్త సత్య వర ప్రసాద్ తన భార్య సుశీల కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. తన భార్య మూడు నెలల గర్భవతి అని.. కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుశీల కోసం వెతుకుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago