టాలీవుడ్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం అఖండ. ఈ సినిమా ఇటీవలే డిసెంబర్ 2న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటించిన విషయం కూడా తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ను సంచలన విజయాన్ని అందుకుంది. ఇక అనుకున్న దానికంటే బాక్సాఫీస్ వద్ద ఎక్కువగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇకపోతే బాలకృష్ణ ఎక్కువగా జాతకాలు నమ్ముతారు అన్న విషయం తెలిసిందే.
సినిమా మొదలు పెట్టేటప్పుడు, రిలీజ్ సమయంలో, రిలీజ్ డేట్ సమయంలో ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా బాలకృష్ణ ఎక్కువగా సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇస్తారు. ఇదే విషయాన్ని బాలకృష్ణ సన్నిహితులు చాలా సందర్భాలలో ధృవీకరించారు. ఇకపోతే బాలకృష్ణ తాజాగా నటించిన అఖండ సినిమాలో ఫస్టాప్ బాగా ఉన్నా ఇందులో సెకండాఫ్ మాత్రం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. సినిమా సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ వచ్చే విధంగా బోయపాటి ఈ సినిమాను తెరకెక్కించారు.
ఇక సినిమా విడుదలైన వారం వరకు కూడా థియేటర్ల వద్ద హౌస్ఫుల్ బోర్డ్ లు దర్శనమిచ్చాయి అంటే ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో మీరు అర్థం చేసుకోవచ్చు. అఖండ సినిమాలో బాలయ్య బొటన వేలుకు ధరించిన ఉంగరానికి, అలాగే అఖండ సినిమా సక్సెస్ కు సంబంధం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ బొటనవేలుకు ధరించిన ఆ పచ్చ రంగు ఉంగరం వల్ల ఈ సినిమా సక్సెస్ అయిందని నమ్ముతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా సక్సెస్ కోసం మంత్రించిన ఉంగరాన్ని బాలయ్య ధరించారని పెద్ద ఎత్తున గుసగుసలు వినిపిస్తున్నాయి.
అమెరికాలో అఖండ సినిమాకు వన్ మిలియన్ కలెక్షన్లు వచ్చాయి. ఈ అఖండ సినిమాతో బాలయ్య ఖాతాలో అరుదైన రికార్డులు చేరుతున్నాయి. జాతకాలను,శాస్త్రాలను నమ్మే బాలయ్యకు అనుకూల ఫలితాలు వస్తుండటంతో అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఆంధ్రలోనే కాకుండా తెలంగాణలో కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లు నమోదయ్యాయి. మొత్తానికి అఖండ సినిమా బాలయ్య ఖాతాలో రికార్డులు చేరడంతో పాటు, మెమరబుల్ సినిమా గా నిలుస్తుంది ఎటువంటి సందేహం లేదు. అలాగే బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమా తరువాత బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచింది. ఇప్పటికే దాదాపుగా 100 కోట్ల వరకు షేర్ కలెక్షన్లు సాధించింది.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…