Featured

ఛార్మి విషయంలో నాకు కోపం వచ్చింది అందుకే.. పవన్ కళ్యాణ్ కామెంట్స్!

మాయగాడు సినిమా షూటింగ్ అయిపోయాక దానికి సంబంధించి హీరోయిన్ ఛార్మి ప్రమోషన్‌కి రానన్నారని ప్రముఖ నిర్మాత యలమంచిలి రవి అన్నారు. ప్రమోషన్‌కు రాకపోతే ఎలా అనే విషయంపై ఆమెతో కొంచెం గొడవ పడాల్సి వచ్చిందని, ఆ తర్వాత పెద్దలైన మురళీ మోహన్ ద్వారా అది సద్దుమణిగిపోయిందని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఆమె ప్రమోషన్‌కు హాజరయ్యారని ఆయన చెప్పుకొచ్చారు. రెమ్యునరేషన్‌ విషయంలోనూ ఆమెకు, తనకు ఎలాంటి విబేధాలు లేవన్న ఆయన, అమౌంట్ మొత్త ఇచ్చేశామని అయినా కూడా ఆమె సినిమా పబ్లిసిటీ చేయడానికి నిరాకరించారని ఆయన వివరించారు.

ఇంత చేసి, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి సినిమా ప్రమోషన్‌కు రాకపోతే ఎలా సినిమా ఏమవుతుంది ? ప్రొడ్యూసర్ ఏమవుతాడు ? అని ఆలోచించి ఆ సమయంలో కొంచెం అగ్రెసివ్‌గా ఉండాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఆ తర్వాత మా అసోసియేషన్‌లో చెప్పేసరికి, మురళీ మోహన్‌ గారు చర్చించి సమస్యను పరిష్కారం చేశారని ఆయన చెప్పారు.

ఇకపోతే ఏపీ ప్రభుత్వం థియేటర్స్‌పై తీసుకున్న నిర్ణయంపై నిర్మాత యలమంచిలి రవి స్పందించారు. తన దృష్టిలో చెప్పాలంటే ఆ జీవో తప్పా, ఒప్పా అనేది పక్కన పెడితే ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వాన్ని హ్యాండిల్ చేసుకునే విధానంలో వైఫల్యం జరిగిందని ఆయన అన్నారు. వ్యాపారం.. వ్యాపారంలా చేయాలన్న ఆయన, ప్రభుత్వాన్ని ఒక ప్రెస్‌మీట్‌లో కూర్చొని ఏదో ఆలోచిస్తే వారు వ్యాపారం ఎందుకు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఎవరికి అవసరం ఉంటే వాళ్లు వెళ్లాలి కదా అని ఆయన చెప్పుకొచ్చారు.

ఇంతకు ముందు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వారంలో ఇండస్ట్రీ నుంచి ఒకరు వెళ్లి బొకే ఇచ్చి, శాలువ కప్పి కలిసొచ్చేవారని, అలా జగన్ అధికారంలోకి వచ్చాక ఎవరైనా వెళ్లారా అని ఆయన అన్నారు. అది వాళ్లు కూడా మనసులో పెట్టుకోరా అని ఆయన ప్రశ్నించారు.

ఇకపోతే పవన్ కల్యాణ్ ఈ జీవోపై స్పందించినా అవసరం ఇండస్ట్రీది కాబట్టి కూర్చొని మాట్లాడుకుంటే అవుతదా లేదంటే ప్రెస్‌మీట్‌లు పెడితే అవుతదా అని ఆయన డైరక్ట్‌గానే ప్రశ్నలు కురిపించారు. రాజకీయ పార్టీ రాజకీయమే చేస్తుందని, మా అసోసియేషన్‌లో మొన్న అంత రాజకీయం జరిగింది. కానీ దాని వల్ల ఎవరికైనా ప్రయోజనముందా అని ఆయన అన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 day ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago